ప్రముఖ సినీ నటుడు, అలాగే ప్రస్తుతం వైసీపీ పార్టీ నాయకుడుగా ఉన్న మోహన్ బాబు, నిన్న తన పుట్టిన రోజు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మోహన్ బాబు ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి తరుపున ఎన్నికల ప్రచారం చేసారు. చివరకు జగన్ మోహన్ రెడ్డి గెలవాలని, ఊరు ఊరు తిరిగారు కూడా. అయితే జగన్ మోహన్ రెడ్డి గెలిచిన తరువాత, మోహన్ బాబుని దగ్గరకు రానివ్వలేదు. చివరకు ఆలీకి కూడా పదవి ఇస్తానని చెప్పిన జగన్, మోహన్ బాబుని మాత్రం దూరం పెడుతూ వచ్చారు. ఇప్పటికీ మోహన్ బాబు ఎక్కడా వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్టు అయితే చెప్పలేదు. ఈ నేపధ్యంలో, నిన్న తిరుపతిలో మోహన్ బాబు తన పుట్టిన రోజు వేడుకులు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనను ప్రచారానికి వాడుకుని వదిలేసారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. మోహన్ బాబు ఎన్టీఆర్ ఉండగా రాజ్యసభ సభ్యుడు అయ్యాడు. తరువాత చంద్రబాబుతో విబేధించారు. ఎప్పుడూ చంద్రబాబుకి ప్రచారం చేయలేదు. కేవలం జగన్ కే మొన్న ఎన్నికల్లో ప్రచారం చేసారు. ఈ నేపధ్యంలోనే, ఇప్పుడు మోహన్ బాబు, తనని ప్రచారానికి వాడుకుని, మోసం చేసారు అనే వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి/
అసలు మోహన్ బాబు ఏమన్నారు అంటే. "జీవితం ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, నాకు అనేక కష్టాలు వచ్చాయి. రాజకీయాల్లోకి వెళ్ళిన తరువాత రాళ్ల దెబ్బలు కూడా పడ్డాయి. ఇలా చెప్పుకుంటూ పొతే, ఒక పుస్తకం రాయొచ్చు. నేను ఇతరులకు ఉపయోగపడ్డాను కానీ, నాకు ఎవరూ ఉపయోగ పడలేదు. ఎంతో మంది రాజకీయ నాయకులు, నాతో ప్రచారాలు చేయించుకున్నారు. నాకు వాళ్ళ సహాయం ఎప్పుడూ రాలేదు. వాళ్ళు నాకు సహాయం ఇవ్వరు కూడా. నేను వాళ్ళ చేతిలో మోసపోయాను. ఎన్టీఆర్ గారు రాజ్యసభ సీటు ఇచ్చారు. జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. అందులో ఇది ఒకటి" అంటూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషన్ అయ్యాయి. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, మోహన్ బాబు, జగన్ వైపు నుంచి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మోహన్ బాబుకు మాత్రం, జగన్ వైపు నుంచి ఎలాంటి సహయం చేయలేదు. చంద్రబాబుని బాగా తిడితే జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకుంటారని మోహన్ బాబు భావించారు కానీ, చివరకు జగన్ హ్యాండ్ ఇచ్చారు