రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో, ఇన్వెస్టర్స్ లో భరోసా పోతుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న స్టార్ట్ అప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఒప్పందం రద్దు చేసుకుంటూ జీవో ఇవ్వటం, వెంటనే సింగపూర్ ప్రభుత్వం కూడా, మేము అమరావతి నుంచి తప్పుకుంటున్నాం అని ప్రకటించటంతో, ఏపి ప్రభుత్వం తీసుకున్న చర్య వివాదాస్పదం అవుతుంది. ఒక కంపెనీ పెట్టుబడి పెట్టాలి అంటేనే, పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా, తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. అలాంటిది సింగపూర్ ప్రభుత్వం, ఏకంగా రంగంలో దిగిటంతో, మిగతా పారిశ్రామిక వేత్తలకు కూడా కాన్ఫిడెన్సు వచ్చి, పెట్టుబడులకు ముందుకు వచ్చారు. అయితే, ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వం, అమరావతి నుంచి వెళ్ళిపోవటంతో, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, ఏకంగా దేశాని పరువు, ప్రతిష్టతకు సంబంధించిన విషయంగా మారింది. సింగపూర్ ప్రభుత్వం, ఏపి ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోవటం, పై, అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
కర్ణాటకకు చెందిన ఆర్థిక వ్యవహారాల నిపుణుడు, అక్షయ పాత్ర సంస్థ సహవ్యవస్థాపకుడు, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ ఛైర్మన్, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టి.వి.మోహన్‌దాస్ పాయ్ కూడా, ఈ విషయం పై స్పందించారు. ఆయన ఈ విషయం పై ట్వీట్ చేస్తూ, ఒకింత ఘాటుగానే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ట్వీట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ వైదోలగటం, ఆంధ్రప్రదేశ్ కు బ్యాడ్ న్యూస్ అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి ఇది, హరాకిరీ అని స్పందించారు. హరాకిరీ అంటే, ఆత్మహత్య అని అర్ధం. అంటే, జగన్ చేజేతులా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, మోహన్‌దాస్ పాయ్ ట్వీట్ చేసారు. జగన్ చేస్తున్న ఈ పనితో, ఒంటి చేత్తో ఆంధ్రప్రదేశ్ పై పెట్టుబడి సంస్థల నమ్మకాన్ని నాశనం చేస్తున్నారు అని అన్నారు.
ఇలాంటి చర్యలతో, ఎవరూ అక్కడ పెట్టుబడి పెట్టరు, ఉద్యోగాలు రావు, అభివృద్ధి ఆగిపోతుంది, ఇది నిజంగానే చాలా బాధకారమైన విషయం అంటూ ఆయన పెర్కున్నారు. అయితే ట్విట్టర్ వేదికగా ఈ అభిప్రాయం చెప్పటంతో, ఆయన ట్వీట్ పై, వైసీపీ సోషల్ మీడియా, దాడి చేసింది. గతంలో కూడా, విద్యుత్ పీపీఏల విషయంలో, జపాన్ ప్రభుత్వం మోడీ కి లేఖ రాయటం పి, మోహన్ దాస్ స్పందిస్తూ, జగన్ ప్రభుత్వాన్ని ఒక "గవర్నమెంట్ టెర్రర్" అంటూ స్పందించారు. దీని పై వైసీపీ ఎదురు దాడి చేస్తూ, ఈయన చంద్రబాబు అజేంట్ అని, చంద్రబాబు డబ్బులు ఇచ్చి వేయిస్తున్నాడు అంటూ, ఆయన ట్వీట్ పై కొంత మంది వైసిపీ సానుభూతి పరులు ఎదురు దాడి చేసారు. అయితే, మోహన్‌దాస్ పాయ్ అనే వ్యక్తీ, చంద్రబాబు చెప్తే చేస్తారా ? ఆయన అక్షయ పాత్ర సంస్థ సహవ్యవస్థాపకుడు, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ ఛైర్మన్, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ అనే విషయం, వీరికి తెలుసో తెలియదో.