దేశంలో ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు ? మోడీ గ్రాఫ్ పెరిగిందా ? తగ్గిందా ? మోడీ సాహోసోపేత నిర్ణయాలు ప్రజలకు నచ్చుతున్నాయా ? మోడీ పని తీరు ఎలా ఉంది ? వివిధ రాష్ట్రాలు సియంలు ఎలా పని చేస్తున్నారు ? ఇలాంటి వివరాలు అన్నీ, ఇండియా టుడే latest గా నిర్వహించిన మూడ్ అఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడయ్యాయి. ఏడాదికి రెండు సార్లు, ప్రతి ఆరు నెలలకు, ఇండియా టుడే, మూడ్ అఫ్ ది నేషన్ సర్వే నిర్వహిస్తుంది. ప్రజల అభిప్రాయలు తెలుసుకుని, ప్రజలు ఇప్పటిప్పుడు ఏమని అనుకుంటున్నారో చెప్తారు. ఈ సారి కూడా ఈ సర్వే నిర్వచించారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో ఈ సర్వే జరిగింది. దాదపుగా 97 పార్లమెంటరీ నియోజకవర్గాలు,194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే చేసారు. మొత్తం 12,126 మంది అభిప్రాయాలని మూడ్ ఆఫ్ ది నేషన్ తీసుకుంది.
ఈ సర్వే జూలై 22, 2019 నుంచి జూలై 30 ,2109 వరకు జరిగింది. ఈ సర్వేలో దేశ వ్యాప్తంగా మోడీకి ఎదురు లేదని తేలింది. ఇప్పటి వరకు భారతదేశంలోనే అత్యంత బలమైన నాయకుడిగా మోడీ ఉన్నారని సర్వే చెప్పింది. భారత దేశంలో అత్యంత బలమైన నాయకుడిగా మోడీ, 71 శాతంతో ముందు ఉన్నారు. ఇదే సర్వే పోయిన జనవరిలో మోడీకి 54 శాతం ఇచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ పార్టీకి 308 సీట్లు వస్తాయని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చెప్పింది. ఎన్డీఏ కలుపుకుంటే, 357 స్థానాలు చెప్పింది. అలాగే కాంగ్రెస్ కు మరింత గడ్డు కాలం ఉందని సర్వే చెప్పింది. ఇప్పుడు ఉన్న నాలుగు రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ కోల్పోతుందని సర్వే చెప్పింది. 370 రద్దు పై, దేశం మొత్తం మోడీ వెంటే ఉంది.
ఇక రాష్ట్రాల విషయాలకు వస్తే, ముఖ్యమంత్రుల పని తీరు చూస్తే, ముఖ్యమంత్రుల పాపులారిటీ కేటగిరీలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మొదటి స్థానంలో ఉన్నారు. జనవరిలో మమతా బెనర్జీ మొదటి స్థానంలో ఉన్నారు, ఇప్పుడు ఆమె ఏడో స్థానానికి పడిపోయారు. 20 శాతంతో తొలి స్థానంలో యోగీ ఆదిత్యనాథ్, 10 శాతంతో, రెండో స్థానంలో నితీష్ కుమార్ కుమార్, 8 శాతంతో మూడో స్థానంలో దేవేంద్ర ఫడ్నవీస్, అదే 8 శాతంతో తరువాత స్థానంలో అరవింద్ కేజ్రీవాల్, అదే 8 శాతంతో తరువాత స్థానంలో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌లు ఉన్నారు. ఇక తరువాత స్థానంలో 7 శాతంతో, జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి తరువాత మమతా బెనర్జీ ఉండటం గమనార్హం.