ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎవరు అధికారంలో ఉన్నారో, అర్ధం కాని పరిస్థితి వచ్చింది అంటే ఆశ్చర్యం లేదు. వైసీపీ మంత్రులు, నాయకులు ప్రవర్తిస్తున్న తీరుతో, జగన్ సియంగా ఉన్నారా లేదో అని అనుమానం వస్తుంది. మొన్నటిదాకా, చంద్రబాబు హైదరాబాద్ లో ఎందుకు ఉన్నారు, అర్జెంటు గా అమరావతి వచ్చేయాలి, ఇలాంటి కష్ట కాలంలో , ఇక్కడ లేకపోతే ఎలా అంటూ, హడావిడి చేసారు. దీనికి స్పందించిన తెలుగుదేశం, చంద్రబాబు హైదరాబాద్ లో ఎలా ఇరుక్కుపోయరో చెప్తూనే, సియం ఇప్పుడు చంద్రబాబు కాదని, ఆయన కోసం అంతగా తపించి పోవాల్సిన పని లేదని, ఎంత జగన్ ఫెయిల్ అయితే మాత్రం, మరీ ఇంతలా చంద్రబాబు రావాలి, ఈ పరిస్థితి నుంచి గట్టేకించాలి అని చెప్తే, జగన్ చేతి కాని వారు అని మీరే చెప్తున్నారని కౌంటర్ ఇవ్వటంతో, నాలుగు రోజులుగా ఈ గోల ఆపారు. అయితే ఇప్పుడు, రోజుకి 80 కేసులు వస్తూ ఉండటంతో, ప్రభుత్వం పై ఒత్తిడి పెరిగిపోతుంది. అన్ని రాష్ట్రాల్లో కంట్రోల్ లోకి వస్తుంటే, మనకు మాత్రం 45 రోజుల లాక్ డౌన్ తరువాత కూడా పెరిగిపోవటం పై, ప్రభుత్వం వైపు వేలు ఎత్తి చూపించే పరిస్థితి.
దీంతో, ఇప్పుడు మంత్రులు ఎదురు దాడి మొదలు పెట్టారు. రాష్ట్రంలో కరోనా పెరిగిపోవటానికి కారణం చంద్రబాబు అని, మంత్రి మోపిదేవి సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు ఎంతకైనా దిగజారి పోతారని, రాష్ట్రంలో కరోనా వైరస్ ను పెంచటానికి, చంద్రబాబు టిడిపి స్లీపర్ సేల్స్ ని రంగంలోకి దించి, రాష్ట్రంలో కేసులు పెరిగేలా చేస్తున్నారని అనుమానం వస్తుందని, దీని వెనుక తెలుగుదేశం పార్టీ కుట్ర ఉందని అనిపిస్తుందని, సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఇలా ఆరోపణలు చెయ్యటం పై ప్రజలు అస్యహించుకునే పరిస్థితి వచ్చింది. అధికారంలో ఉండి కూడా, ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు, ప్రెస్ మీట్లు పెట్టి, ఇలా ఆరోపణలు చెయ్యటం పై, విమర్శలు వస్తున్నాయి.
ఇలా కుట్ర చేసి ఉంటే, అధికారంలో ఉన్న వాళ్ళు ఏమి చేస్తున్నారు ? మంత్రి వ్యాఖ్యల పై, టిడిపి భగ్గు మంది. అధికార మదంతో, ర్యాలీలు చేస్తూ, కరోనా వ్యాప్తి చేసింది ఎవరూ అంటూ ప్రశ్నించింది. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, అసమర్థతను కప్పిపుచ్చేందుకే మా పై ఆరోపణలు చేస్తున్నారని అనంరు." జగన్ కరోనాను చాలా తక్కువ చేసి మాట్లాడారు. కరోనాను అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని సీఎం అన్నారు. కరోనాను పట్టించుకోకుండా ఎన్నికలు జరిపి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది. వైసీపీ నేతలు, మంత్రులు కరోనా సాయాన్ని ఎన్నికల ప్రచారం స్థాయింలో చేస్తున్నారు. నగరిలో రోజా పూలు జల్లించుకున్నారు. వైసీపీ నేతలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నరారు. టీడీపీ నేతలంతా ఇళ్లలోనే కూర్చున్నారు. దేశమంతా లాక్ డౌన్లో ఉంటే ఎస్ఈసీ కనగరాజ్‌ను ఎలా తీసుకువచ్చారు? .రోడ్లపైకే రాని టీడీపీ నేతలపై ఆరోపణలు చేస్తారా?" అంటూ నక్కా ఆనందబాబు మండి పడ్డారు.