సోషల్ మీడియా ఎంత కలుషితం అయిపోయిందో తెలిసిందే. మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో, స్పెషల్ టీంలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం, తెలుగుదేశం పార్టీ వెనకుబడి ఉంది. టెక్నాలజీ ప్రేమికుడిగా ఉన్న చంద్రబాబు, ఎందుకోగాని, అసలు సోషల్ మీడియాను పట్టించుకోటం లేదు అనే అసంతృప్తి తెలుగుదేశం శ్రేణుల్లో ఉంది. చేసిన మంచి చెప్పుకోవటానికి కాని, ప్రత్యర్ధుల ఆరోపణలు తిప్పి కొట్టటానికి కాని స్పెషల్ టీంలు లేవు. ప్రభుత్వ పరంగా మాత్రమే, ట్విట్టర్, ఫేస్బుక్ లో చంద్రబాబుకి ఒక టీం పని చేస్తుంది. అయితే, తెలుగుదేశం పార్టీకి భిన్నంగా, అటు జగన్, ఇటు పవన్ స్పెషల్ టీంలు పెట్టుకుని, బురద చల్లుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి, దేశంలోనే నెంబర్ 1 పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ టీంని తెచ్చి పెట్టుకున్నారు. వీళ్ళు సోషల్ మీడియాలో, జగన్ ఏమి చేస్తాడో చెప్పటం కంటే, చంద్రబాబుని, లోకేష్ ని టార్గెట్ చేసే పనిలోనే ఉన్నారు. ఇక జనసేన కూడా, చింతలబస్తీ దేవ్ ని తీసుకొచ్చి, ఆయన ఆధ్యర్యంలో 800 మందితో హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసి మరీ, విషం చిమ్ముతున్నారు.

manikyalarao 25122018

లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు చెప్తూ, సోషల్ మీడియా మొత్తం కలుషితం చేస్తున్నారు. లోకేష్ ఏదన్నా స్పీచ్ ఇస్తున్నాడు అంటే, ఒక టీం ఏకంగా ఆయన స్పీచ్ ఫాలో అవుతా, ఎక్కడన్నా మాట తూలతారేమో అని చూసి, లోకేష్ ని హేళన చేస్తూ అనేక వీడియోలు చేస్తున్నారు. అదే విధంగా చంద్రబాబుని కూడా టార్గెట్ చేస్తూ నడుస్తున్నాయి. అయితే, ఏపి రాజకీయాల్లో బీజేపీ ఎంటర్ అయిన దగ్గర నుంచి, కుల గొడవలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. కులాల మధ్య చిచ్చు పెడుతూ, రాష్ట్రంలో అల్లర్లకు కుట్ర చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే సోషల్ మీడియాలో కూడా, ఈ విధంగా నడుస్తున్నాయి. ఒక కులాన్ని టార్గెట్ చేసుకుంటూ, మరో కులం పై తప్పుడు పోస్ట్ లు పెడుతున్నారు.

manikyalarao 25122018

ఈ క్రమంలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, సీఎం చంద్రబాబును కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లపై కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. చంద్రబాబు మాట్లాడని మాటలు మార్ఫింగ్‌ చేసి.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేసినట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారని, ఓ సామాజికవర్గానికే పని చేస్తామని చంద్రబాబు చెప్పినట్టు తప్పుడు పోస్ట్‌లు పెడుతున్నారని వర్ల పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌ విశ్వసనీయతను దెబ్బతీసేలా మార్ఫింగ్‌ చేసి పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం, వర్ల రామయ్య పై కూడా కులం పేరుతో దుషిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టిన విషయం, ఆ విషయం పై కంప్లైంట్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read