మాకు ఎదురు తిరిగాడు అనే కోపంతో, చంద్రబాబుని దించటానికి, మూడు నెలల క్రితం ఆపరేషన్ గరుడని, బీజేపీ మొదలి పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అనేక మందిని కూడగట్టి, చంద్రబాబుని అన్ని వైపుల నుంచి నిరాధార ఆరోపణలతో, నిందించే ప్రయత్నం చేసి, ప్రజల్లో ఆ అబద్ధాలు, నిజం అనే ప్రచారం చేపిస్తుంది బీజేపీ.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ, తిరుమల గొడవ... ఇప్పటికే పవన్ కళ్యాణ్, జగన్, ముద్రగడ, ఐవైఆర్, ఉండవల్లి లాంటి ఉద్దండులను ఈ ఆపరేషన్ గరుడలోకి తీసుకువచ్చిన బీజేపీ, ఇప్పుడు తాజాగా తెలంగాణా నాయకుడు మోత్కుపల్లిని కూడా, ఆపరేషన్ గరుడలో ఆక్టివ్ రోల్ ఇస్తుంది.. ఇందులో భాగంగా ఆయన, మోత్కుపల్లి ఈ రోజు, పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు.
ఇప్పటికే మోత్కుపల్లిని ముద్రగడ, విజయసాయి రెడ్డి కలిసారు. ఎలా ఏమి చెయ్యాలో ప్లాన్ చెప్పారు. ఆ ప్లాన్ లో భాగంగా, మోత్కుపల్లి జనసేనలోకి వేల్తునట్టు తెలుస్తుంది. తనను చంద్రబాబు మోసం చేసాడని, గవర్నర్ పదవి నాకు ఇవ్వకుండా, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాడని, అందుకే చంద్రబాబు అంతు చూస్తా అంటూ, గత రెండు నెలల నుంచి మోత్కుపల్లి రంకెలు వేస్తున్నారు. చంద్రబాబుని దించేలానే మీ ప్రయత్నంలో నేను భాగస్వామిని అవుతానని, ఇప్పటికే విజయసాయి రెడ్డికి, బీజేపీ పెద్దలకు అభయం ఇచ్చారు. ఆపరేషన్ గరుడలో నేను భాగస్వామి అవ్వటం, మీలాంటి గొప్ప నేతలు, ఐవైఆర్, పవన్, జగన్, సోము వీర్రాజు లాంటి ఉద్దండులతో కలిసి పని చెయ్యటం నాకు ఎంతో సంతోషంగా ఉందని, మీరు ఏమి చెప్తే, ఎలా చెప్తే అలా చెయ్యటానికి సిద్ధం అని మోత్కుపల్లి, ఇప్పటికే చెప్పారు.
ఇందులో భగంగానే, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో మోత్కుపల్లి నరసింహులు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానున్నారు. ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తెలంగాణ టీడీపీలో కీలక నేతగా ఉండి.. పార్టీ అధినేతపైనే విమర్శలు చేయడంతో బహిష్కరణకు గురైన మోత్కుపల్లి.. జనసేనలో చేరేందుకు పవన్ కల్యాణ్‌తో భేటీ కాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మోత్కుపల్లి జనసేనలో చేరితే ఆయనకు ఏ పదవి ఇస్తారనే అంశం కూడా చర్చకు వస్తోంది. తెలంగాణలో జనసేనకు కీలక నేతలు ఎవరూ లేరు కాబట్టి మోత్కుపల్లిని జనసేన తెలంగాణ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తి వివరాలు, ఈ భేటీ తరువాతే తెలిసే అవకాశం ఉంది.