మోత్కుపల్లి నరసింహులు.. తెలంగాణాలో మొన్నటి దాకా తెలుగుదేశం పార్టీలో కీలక నేత. బీజేపీతో తెలుగుదేశం పార్టీ కటీఫ్ చెప్పటంతో, తనకు హామీ ఇచ్చిన గవర్నర్ పదవి దక్కలేదని, చంద్రబాబు పై కక్ష పెంచుకుని, జగన్ పంచన చేరారు. గత ఎన్నికల్లో తిరుమల మెట్లు ఎక్కి మరీ చంద్రబాబు ఓడిపోవాలని కోరుకుని, దళితుల ఓట్లు చంద్రబాబుకి పడకుండా, తన వంతు ప్రయత్నం చేసి, జగన్ గెలుపులో తాను కూడా, ఉడతా భక్తి సాయం చేసిన సంగతి తెలిసిందే. అయితే అందరికీ జ్ఞానోదయం అయినట్టు, మోత్కుపల్లి కూడా జగన్ ఏడాది పరిపాలన పై, పిక్చర్ క్లియర్ గా కనిపించింది. ఆంధ్రప్రదేశ్ లో గత 14 నెలలుగా దళితుల పై జరుగుతున్న దమనకాండ పై మోత్కుపల్లి తీవ్రంగా స్పందించారు. మాలాంటి వాళ్ళు మీరు గెలవాలి అని కోరుకుంది, ఇందుకు కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో దళితుల పై జరుగుతున్న దాడుల్లో, ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు మోత్కుపల్లి. దీన్ని జగన్ సరి చేసుకోక పొతే, తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు.

డా సుధాకార్, డా అనితా రాణి, జడ్జి రామకృష్ణ, శిరోమండనం, మైనర్ బాలిక రేప్, మాస్కు లేదని చంపేయటం, ఇలా అనేక ఘటనలు జరుగుతున్నా, కనీసం వాటిని కరెక్ట్ చేసే ప్రయత్నం కూడా చెయ్యటం లేదని మోత్కుపల్లి అన్నారు. ఎవరు అయితే మిమ్మల్ని ఓటు వేసి గెలిపించిన దళితులు ఉన్నారో, వారి పైనే దాడులు చెయ్యటం చూస్తుంటే, అగ్ర కుల అహంకారం, డబ్బున్న అహంకారం కనిపిస్తుందని అన్నారు. జరిగిన అన్ని సంఘటనల పై, ప్రభుత్వ విధానం పై తీవ్ర నిరసన తెలియ చేస్తున్నాం అని అన్నారు. డా సుధాకర్ పై దాడి వెనుక, ప్రభుత్వమే ఉందని, అందరూ అంటున్నారని, అది కాదు అని ఆనాడే ప్రభుత్వం ఒక మెసేజ్ పంపించి ఉంటే, దళితుల పై ఇలా వరుస పెట్టి ఘటనలు జరిగి ఉండేవి కాదని, అందుకే దళితులు పై జరుగుతున్న అన్ని దాడులకు ప్రభుత్వం బాధ్యత వహించాలని మోత్కుపల్లి డిమాండ్ చేసారు. మేము ఇది కోరుకుని, జగన్ కు మద్దతు ఇవ్వలేదని, మంచి చేస్తారు అనుకుంటే, ఇలా చెయ్యటం కరెక్ట్ కాదని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read