ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో రెండు భారీ ప్రాజెక్ట్ లు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ శ్రమ ఫలించింది. నాలుగు రాష్ట్రాలు పోటీ పడినా మొత్తానికి సాధించారు. ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ సంస్థతో ఈ రోజు ఒప్పందం ఉంటుంది అని చెప్పారు కాని, ఆ కంపెనీ పేరు చెప్పలేదు. అయితే, ఈ రోజు ఒప్పందం చేసుకునే కంపెనీ పేరు, హోలీటెక్‌ సంస్థ అని సమాచారం. ఫోన్ల విడిబాగాలు, ఎలక్ర్టానిక్స్‌ పరికరాల తయారీలో పేరొందిన ఈ సంస్థ.. రూ.1400 కోట్ల పెట్టుబడితో తిరుపతిలో తన కర్మాగారం నెలకొల్పనుంది. ఫలితంగా ఆరు వేల మందికి నేరుగా ఉద్యోగాలు లభిస్తాయి. ఈ కంపెనీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి కృషి ఫలించి.. ఎట్టకేలకు ఏపీలో కర్మాగారం ఏర్పాటుకు సదరు కంపెనీ అంగీకరించింది. అయితే ఇతర రాష్ట్రాలు కూడా దీనికోసం తీవ్రంగా పోటీపడుతున్న నేపథ్యంలో దాని పేరు, తమ ప్రయత్నాల వివరాలను రాష్ట్రం బయటకు వెల్లడించలేదు. హోలీటెక్‌ ప్రతినిధులు సోమవారమిక్కడ చంద్రబాబును కలిసి అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు.

ap 06082018 2

20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కర్మాగారం ఏర్పాటుచేస్తారు. ఇప్పటివరకు మన దేశంలో ఉన్న ఎలక్ర్టానిక్స్‌ కంపెనీలన్నీ.. అసెంబ్లింగ్‌ చేసేవి మాత్రమే. అంటే విడిభాగాలను తీసుకొచ్చి అమర్చుతున్నాయి. ఇప్పుడు తొలిసారి దేశంలో హోలీటెక్‌ రూపంలో ఎలక్ర్టానిక్స్‌ విడిభాగాల తయారీ కర్మాగారం రాష్ట్రానికి రానుంది. ఇప్పటికే ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ లాంటి ప్రసిద్ధ కంపెనీలు తరలిరాగా.. ఇప్పుడీ జాబితాలో హోలీటెక్‌ కూడా చేరింది. మరో వైపు, ప్రపంచ స్థాయిలోనే 'భారత్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (బెస్ట్) సంస్థ రూపొందించిన తొలి థర్మల్ బ్యాటరీ కంపెనీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఆవిష్కరించనున్నారు. ఇంధన ఉత్పత్తిని పెంచడానికి ఈ బ్యాటరీని తయారు చేసినట్లు బెస్ట్ సంస నిర్వాహకులు తెలిపారు. ఈ టెక్నాలజీ వినియోగంతో కార్బన్ వాయువులను తగ్గించడమే కాక గ్రిడ్లలో సమ తుల్యతను పాటించవచ్చనివారు చెప్పారు.

ap 06082018 3

అంతేకాక ఈ బ్యాటరీ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు టెలీ కమ్యూనికేషన్స్, వాణిజ్య సంస్థలు విద్యుత్ తో నడిచే వాహనాలు నిల్వచేసుకుని అవసరం మేరకు వినియో గించుకొనే వెసులుబాటు ఉందని చెప్పారు. దీనిని కొండప్రాంతాలు, దీవుల్లోనే కాక సుదూర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసుకుని అవసరం మేరకు ఇంధనాన్ని వాడుకునే అవకాశం ఉందని వారు చెప్పారు. ఈ బెస్ట్ సంస్థ రూ. 660 కోట్ల పెట్టుబడితో 'గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును ఏర్పాటు చేసి వచ్చే మూడు సంవత్సరాల్లో మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రతిపాదించింది. ప్రారంభ దశలో వెయ్యి మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ వచ్చే ఆరు, ఏడు సంవత్సరాల కాలంలో 10 గిగావాట్ల ఉత్పత్తి దిశగా ప్రణాళికలను సిద్ధం చేసుకోంటోంది. తొలిదశలో టెలీకమ్యూనికేషన్స్, మైక్రో గ్రిడ్లకు, ఎలక్ట్రిక్ బస్సులకు వినియోగించే బ్యాటరీలను ఉత్పత్తి చేయాలని తలపెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో మే 2019లో ఈ ప్లాంట్ వాణిజ్య కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం ఉందని బెస్ట్ సంస్థ ప్రముఖులు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read