అది ప్రశాంతమైన రాజమహేంద్రవరం... అనుకోని సంఘటన జరిగింది... డబ్బులు కోసం జరిగిన హత్య అది... కాని దాన్ని క్యాష్ చేసుకుని, రాష్ట్రంలో అశాంతికి ప్లాన్ చేసారు... అన్ని రకాలుగా రెచ్చగొట్టారు... కాని ప్రజలు సంయమనం పాటించటం, పోలీసు శాఖ తగు చర్యలు తీసుకోవటం, ప్రభుత్వం భరోసాతో పెద్ద గండమే తప్పింది.. ఏ మాత్రం ప్రజలు వారి మాటలు విన్నా, రాష్ట్రంలో జరగరాని ఘోరం జరిగి, మత కల్లోలాలు జరిగేవి... కాని 48 గంటల్లోనే పోలీసులు జరిగిన విషయం సాక్ష్యాలతో సహా బయట పెట్టటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు... ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేగంగా స్పందించిన తీరు, అభినందనీయం... వివరాల్లోకి వెళ్తే..

real 02012018 2

రాజమహేంద్రవరంలో మసీదు మౌజస్ దారుణ హత్యకు గురయ్యాడు... హత్య చెయ్యటమే కాక, మసీదుని అపవిత్రం చేసి, అక్కడ ఉన్న ఖరాన్ చింపివేసాడు నిందితుడు... కేవలం అతని దగ్గర ఉన్న 3 వేల రూపాయల కోసం హత్య చేసాడు.. అనుమానం రాకుండా, మసీదులో అపవిత్ర కార్యక్రమాలు చేసి, విచారణ తప్పుదోవ పట్టిద్దాం అనుకున్నాడు.. ఇదే సందర్భంలో ఇది రాజకీయ కోణం తీసుకుని, హిందూ, ముస్లిం మధ్య గొడవగా సృష్టించటానికి కొన్ని రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి... సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే, రెచ్చగొట్టే ప్రయత్నం చేసాయి.. అయితే, ప్రమాదాన్ని గ్రహించిన ప్రభుత్వం, పోలీసు శాఖను అప్రమత్తం చేసింది... ముఖ్యమంత్రి స్వయంగా, సంయమనం పాటించమని పిలుపు ఇచ్చారు...

real 02012018 3

హత్య కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. సిఎం ప్రకటించిన గడువులోగానే పోలీసులు హంతకుడిని అరెస్ట్ చేసారు... హత్య జరిగిన 48 గంటల్లోనే పట్టేసుకున్నారు... ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్‌ టైం గవర్నెన్స్ సెంటర్‌ నుంచి ఎప్పటికప్పుడు, రివ్యూ చేస్తూ, తగు సూచనలు ఇచ్చారు... అక్కడ ఒక సిసి కెమెరా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, నిందితుడు ఉరవకొండలో ఉన్నాడు అని సమాచారం రావటంతో, అక్కడకు వెళ్లి పట్టుకున్నారు... హత్య జరిగిన 48 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అని రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జిల్లా ఎస్పీకి సూచించారు. మొత్తానికి పోలీసులు వెంటనే స్పందించటంతో, వేరే వాటికి తావు లేకుండా, ప్రశాంతంగా సమస్య సద్దుమణిగింది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read