ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వివాదం రోజు రోజుకి ముదురుతోంది. అటు సినిమా వర్గాలు ఇటు ప్రభుత్వ నేతలు ఒకరికొకరు ఘాటుగా విమర్శలు చేసుకుంటూ రోజూ వివాదాల్లో నిలుస్తున్నారు. నాలుగు రోజుల క్రితం నాని కూడా ప్రభుత్వం పైన ఘాటుగానే విమర్శలు చేసారు. ప్రభుత్వం సినిమా రెట్లు తగ్గించడం వల్ల దియేటర్లను ముసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, సినిమా మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవిస్తున్నాయని, ఇలా రేట్లు తగ్గించడం వలన ధియేటర్ల ఆదాయం కంటే కిరాణా కొట్ల ఆదాయమే ఎక్కువగా ఉంటుందని హీరో నాని విమర్శించారు. ఇలా సినిమా పెద్దలు విమర్శిస్తున్నారని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కక్ష్యతో సినిమా దియేటర్లపై దా-డు-ల-కు పాల్పడుతుంది. ఆ తరువాత హీరో నానికి మద్దతుగా హీరో సిదార్ధ కూడా స్పందించారు. ఇలా రోజుకొకోక రకంగా ఈ సినిమా టికెట్ల వివాదం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది. మరో వైపు తాజాగా ఈ విషయం పై రాజమండ్రి ఎంపీ భరత్ కూడా తన ట్విట్టర్లో సినిమా రంగం గురించి విమర్శిస్తూ ఒక ట్వీట్ చేసారు. తెలుగు ఇండస్ట్రీ అంత హైదరాబాద్‌లోనే ఉందని, కాని సినిమాలకు 70% ఆదాయం మా ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుందని,సినిమాలో పనిచేసే చిన్న వర్కర్స్ దగ్గర నుంచి బడా హీరోల వరకు ఆదాయం మా ఏపి నుంచే వస్తోందని అన్నారు.
కాబట్టి తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం ఆంధ్రప్రదేశ్ కు రావాలని అంటూ ట్వీట్ చేసారు. ఈయన చేసిన ఈ ట్వీట్‌కు ఒక నెటిజెన్ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. మీ వైసిపి పార్టీ లోనే ఒక రాజ్య సభ ఎంపీ, రాంకీ గ్రూప్ అనే పేరుతో పరిశ్రమ హైదరాబాద్ లోనే నడుపుతున్నాడు, ఏపి లో ఒక బ్రాంచ్ కూడా లేదు, వాళ్ళని రామ్మనకుండా, మీరు ఎలా నియంత్రిస్తారు అని కౌంటర్ ఇచ్చారు. అలాగే సిని ఇండస్ట్రీతో ఏమైనా సమస్యలు ఉంటే, పిలిచి మాట్లాడుకోవాలి కానీ, వారిని ఇబ్బంది పెట్టి, మీ కాళ్ళ దగ్గరకు రావాలనుకోవం ఏమిటి అని మరొకరు కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి ఎంపీ భారత్ ట్వీట్ తో ట్విట్టర్లో వార్ నడుస్తోంది. మరో పక్క, ఈ రోజు సినిమా థియేటర్స్ యాజమాన్యాలతో, ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ నిర్ణయాలకు ధియేటర్లు మూసుకు పోయాయి. దీంతో సమస్య పరిష్కారం కోసం, ధియేటర్ల యాజమాన్యాలు రంగంలోకి దిగాయి. ఈ రోజు మంత్రి మంత్రి పేర్ని నానితో ధియేటర్ యాజమాన్యాలు సమావేశం కానున్నారు.