నిన్న జరిగిన ఘటనపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు, కార్యకర్తలే రమ్యశ్రీ ఇంటి వద్ద గొడవ సృష్టించేందుకు ప్రయత్నించారని టీడీపీ ఎస్సీ సెల్ అద్యక్షులు ఎం.ఎస్ రాజు తీవ్ర స్ధాయిలో వైసీపీ నేతలపై మండిపడ్డారు. టీడీపీ జాతీయ కార్యాయలంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..... లోకేశ్ జీజీహెచ్ దగ్గరకు వస్తున్నారని తెలిసి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి వైసీపీ నాయకుల్ని వెంటేసుకుని వచ్చి కావాలనే గొడవ సృష్టించే ప్రయత్నం చేశారు. అంబులెన్సును టీడీపీ నేతలు అడ్డుకున్నారన్నది అవాస్తవం. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రమ్య మృతదేహాన్ని హడావుడిగా అంబులెన్స్ లో తరలిస్తుంటే..ఎక్కడికి పోలీసుల్ని ప్రశ్నించాం తప్ప అడ్డుకోలేదు. లోకేశ్ టీడీపీ నాయకులు రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వాళ్ల ఇంటికి వెళ్తే అక్కడ కావాలనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు లోకేశ్ ని కించపరిచేలా నినాదాలు చేస్తూ.టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టారు. అయినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సహనం పాటించారు. కానీ పోలీసులు మాత్రం వైసీపీ నాయకులు, కార్యకర్తల్ని నిలువరించకుండా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దా-డు-లు చేసి అరెస్ట్ చేశారు. లోకేశ్ పరామర్శకు వస్తే వైసీపీకి రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటి? లోకేశ్ అక్కడికి ఎందుకొచ్చారని వైసీపీ నేతలంటున్నారు? రాష్ట్రం ఎవడబ్బ జాగీరు? ప్రతిపక్ష పార్టీ నేతగా బాధిత కుటుంబాన్ని పరామర్శించే హక్కు లోకేశ్ కి లేదా? స్వాతంత్ర్య దినోత్సవం నాడు మీ చేతాకాని పాలనలో పట్టపగలు దారుణంగా దళిత యువతి హ-త్య-కు గురైతే... ఆ కుటుంబాన్ని ఓదార్చేందుకు లోకేశ్ వస్తే తప్పేంటి? నాలుక కో-స్తా-మం-టా-రా? ఆర్దిక ఉగ్రవాది పార్టీలో పనిచేసే మీకే అంత ఉంటే... 40 ఏళ్లుగా నీతి నీతి నిజాయితితో రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసే మాకెంత ఉండాలి. శవ రాజకీయాలు చేసేది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు. శవ రాజకీయాలే పునాదిగా పుట్టిన పార్టీ వైసీపీ కాదా? తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేసింది ఎవరు? దిశ చట్టం గురించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు ఇప్పుడు ఎందుకు కట్టుబడిలేరని లోకేశ్ మాట్లాడితే వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణ చేస్తారా? లోకేశ్ నాలుక కో-స్తా-మం-టా-రా?
మహిళల ప్రాణాలు కాపాడలేని దిశ యాప్ , దిశ చట్టం ఎందుకు? ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో దళిత యువతిపై అ-త్యా-చా-రం జరిగితే రెండు నెలలైనా నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వైసీపీ లోని దళిత నేతలు జగన్ రెడ్డికి భజన, బానిసత్వం చేయాలనుకుంటే చేయండి. దళితులపై దాడులు, అత్యాచారాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? బాధిత కుటుంబాన్ని పరామర్శించటానికి లోకేశ్ వస్తే రాజకీయ రచ్చ చేస్తారా? కొడాలి నాని లాంటి వాళ్లు లోకేశ్ ని చూసి భయపడుతున్నారు. లోకేశ్ చూసి వైసీపీ పునాుదులు కదులుతున్నాయి. మంత్రి పదవి రెన్యూవల్ చేయాలంటే జగన్ ని పొగుడుకోండి అంతే తప్ప దళితుల విషయంలో చులకనగా మాట్లాడితే సహించం. గన్ కంటే జగన్ ముందు వస్తారన్న జబర్తస్ డైలాగ్ లు ఇప్పుడు ఎందుకు అమలు కావటం లేదని మాట్లాడితే వైసీపీ నేతలకు భాద ఎందుకు? దిశ చట్టాన్ని పొరుగు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని హోమంత్రి అంటున్నారు, దిశ చట్టమే అమలులో లేనపుడు, పొరుగు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయటం విడ్డూరంగా. కొంతమంది పోలీసుల అధికారులు వైసీపీ కి ఒత్తాసు పలకటం సరికాదు. వైసీపీకి ఊడిగం చేయాలనుకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి వైసీపీలో చేరాలి. ఎల్జీ పాలిమర్స్ లో ఘటనలో చ-ని-పో-యి-న వారికి స్పెషల్ ప్లైట్ వేసుకుని మరీ రూ. కోటి ఇచ్చిన ముఖ్యమంత్రి తన ఇంటికి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న దళిత యువతి రమ్మ శ్రీ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు. సాయంలో వివక్షత, పరామర్శలో వివక్షత సిగ్గుచేటు. టీడీపీ హయాంలో దళితులకు దాడులు జరిగితే ఏం చేశారని వైసీపీ నేతలంటున్నారు. గరగపర్రులో దళితులకు చంద్రబాబు ఏం న్యాయం చేశారో..నెల్లూరు లో పోలీసులకు, దలితులకు జరిగిన సంఘటలో చంద్రబాబు ఏం న్యాయం చేశారో, జూపూడిని, కారెం శివాజీని అడగండి. టీడీపీ పాలనలో ఏ ఘటన జరిగినా చంద్రబాబు దళితులకు అండగా ఉండి సత్వర న్యాయం చేశారు. వైసీపీలో పాలనలో దళితులపై జరిగిన దాడులపై వైసీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్దమా? వైసీపీ ప్రభుత్వం నిందితులకు కొమ్మకాస్తోంది కాబట్టే రాష్ట్రంలో దళితులుపై దా-డు-లు, అ-త్యా-చా-రా-లు పెరిగిపోతున్నాయని ఎం. ఎస్ రాజు అన్నారు.