రాష్ట్రంలో వ్యక్తికోసం వ్యవస్థలు పనిచేస్తున్నాయని, ఇంతటి దారుణమైన పరిస్థితులను ఇప్పుడే చూస్తున్నామని, విద్యార్థుల హక్కుల కోసం టీ.ఎన్.ఎస్.ఎఫ్ విభాగం పోరాడితే, టీడీపీ అనుబం ధ విభాగం నేతలపై అక్రమకేసులు పెట్టి, అరెస్టులు చేశారని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్.ఎస్.రాజు మండిపడ్డారు. జగన్ తప్పులను ఎత్తిచూపిన ప్రతిఒక్కరిపై అక్రమకేసులతో అణచి వేయాలనిచూస్తే, తిరుగుబాటు అనేది మరింత పెరుగుతుంది తప్ప తగ్గదని రాజు తేల్చిచెప్పారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విద్యార్థు లకు సకాలంలో సక్రమంగా అమ్మఒడి అమలుచేయకపోవడంతో, అనేకమంది విద్యార్థులు తమ విద్యనుకోల్పోయే పరిస్థితి ఏర్పడింద న్నారు. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ టీడీపీ అనుబంధ విభాగమైన టీ.ఎన్.ఎస్.ఎఫ్ సీఎం ఇంటి ముట్టడికి పూనుకుంటే, సదరు విభాగానికి చెందిన నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం రాష్ట్రంలో అమలవుతున్న జగనోక్రసీకి నిదర్శమన్నారు. గతంలో కరోనా విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న వేళలో ఎన్నికలను రద్దుచేసినప్పుడు, ముఖ్యమంత్రిసహా, మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికలకమిషనర్ ను నానా విధాలుగా దుర్భాషలా డారని, అటువంటి వారు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామంటే ఎందుకు ఎకరాలకు, ఎకరాలు తడుపుకుంటున్నారని రాజు ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికలంటే ప్రభుత్వానికి ఎందుకంత భయ మన్న రాజు, అరాచకపాలనను, అవినీతి పాలనను, నియంత్రత్వ విధానాలను చూసి విసిగివేసారినప్రజలు ఎక్కడ తమకు కర్రుకాల్చి వాతపెడతారోనన్నభయంతోనే పాలకులు ఎన్నికలకు వెళ్లడానికి భయపడుతున్నట్లు అనిపిస్తోందన్నారు. జగన్ సింహంతో పోలుస్తూ కీర్తించేవారు, ఇప్పుడు గ్రామసింహంలా ఆయన వెనక్కు తగ్గడంపై ఏంసమాధానం చెబుతారన్నారు. ఉద్యోగస్తుల సమస్యలు, వారిహక్కులకోసం పోరాడాల్సిన ఉద్యోగసంఘాలు, ఆయా సంఘాలనేతలు జగన్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయాలను గౌర విస్తూ, ప్రజలకు విరుద్ధంగా ఎందుకు పనిచేస్తున్నారని రాజు నిలదీ శారు.
ఉపాధ్యాయులకు మద్యం దుకాణాలవద్ద డ్యూటీలు వేసిన ప్పుడు, పోలీసులను మద్యం దుకాణాలవద్ద కాపలా ఉంచినప్పు డు, పాఠశాలలుతెరిచి విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాట మాడినప్పుడు, ఉద్యోగ సంఘాల నేతలకు కరోనా గుర్తుకురాలేదా అని టీడీపీనేత మండిపడ్డారు. జగన్ వ్యక్తిగత అభిప్రాయాలను గౌర విస్తూ, ఆయన అభిమతాన్ని అమలుచేయాలనుకుంటున్న వెంక ట్రామిరెడ్డి ఉద్యోగులసంఘానికి నాయకుడా, లేక జగన్ రెడ్డి అభి మతానికి నాయకుడో సమాధానంచెప్పాలన్నారు. అంతటి అభిమా నముంటే, ఆయన తనఉద్యోగానికి రాజీనామాచేసి, వైసీపీ కండు వా కప్పుకోవచ్చన్నారు. ప్రజాస్వామ్యంలో నిజమైన పాలకులు ఎవరూ ఎన్నికలకు భయపడరని, ఈవీఎంలతో గెలిచినవ్యక్తి కాబట్టే ప్రజల్లోకి వెళ్లడానికి వెనుకాడుతున్నాడన్నారు. ఈవీఎంలతో గెలి చాడు కాబట్టే, జగన్ పోలీసు వలయాలు, వలలు లేకుండా తాడే పల్లి ప్యాలెస్ దాటిబయటకు రావడం లేదన్నారు. అనుచరులు, కార్యకర్తలు జగన్ ను పులి, మగాడు అని చెప్పుకుంటారని, అటు వంటి పులి ఎన్నికలంటే ఎందుకు పారిపోతోందో, ఆయన్ని వివిధ రకాల పేర్లతో పిలిచి ఆనందపడేవారే సమాధానంచెప్పాలని రాజు డిమాండ్ చేశారు. టీ.ఎన్.ఎస్.ఎఫ్ విభాగం, తెలుగుమహిళ విభా గం, టీడీపీనేతలనుచూసి జగన్ ఎందుకంతలా భయపడుతున్నా డో తెలియడంలేదన్నారు. జగన్ లో నిజంగా రాయలసీమ పౌరుష మే ఉంటే, నిమ్మగడ్డను ఢీకొని, ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ నేత తేల్చిచెప్పారు. జగన్ లోని పిరికితనాన్ని చూసి అందరూ హేళన చేయకముందే, ఆయనమగాడిలా ఎన్నికలకు సిద్ధమవ్వాలన్నా రు. 20నెలలతనపాలనలో తాను మూటుకట్టుకున్న ప్రజా వ్యతిరేకత మొత్తం స్థానిక ఎన్నికల్లో ప్రజలుతనపై చూపిస్తార న్న భయంతోనే జగన్ ఎన్నికలంటే భయపడుతున్నాడన్నారు.
గౌరవ డీజీపీగా కాకుండా, సవాంగ్ వైసీపీ అధికారప్రతినిధి గా వ్యవహరిస్తున్నాడని, ఆయనచరిత్రలో చరిత్రహీనుడిగా నిలిచిపోవ డం ఖాయమని రాజు తేల్చిచెప్పారు. డీజీపీ తనకున్నహక్కులను, చట్టాలను తోసిపుచ్చుతూ, ప్రభుత్వానికి వత్తాసుపలకడం సిగ్గుచే టన్నారు. దళితులపై, బీసీలపై, మైనారిటీలపై తప్పుడుకేసులు పెట్టి చోద్యంచూస్తున్న డీజీపీ, ఏనాడూ అధికారపార్టీ వారి తప్పు లను ఎత్తిచూపినఘటన ఒక్కటీ లేదన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థు లకు విదేశాలకు వెళ్లిచదువుకునే అవకాశం కల్పిస్తే, జగన అధికా రంలోకి వచ్చాక, ఆయావర్గాల విద్యార్థుల బంగారుభవిష్యత్ ను చిధిమేశాడని రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్ విద్యోన్న తి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి వంటిపథకాలను రద్దుచేయడం ద్వారా లక్షలాదిమంది విద్యార్థుల జీవితాల్లో జగన్ ప్రభుత్వం చీకట్లు నింపిందన్నారు. తనపార్టీపేరులో ఉన్నఅన్నివర్గాలకు జగన్ తీరని అన్యాయం చేశాడని, పేరుకే అధి కారపార్టీ యువజన, శ్రామిక, రైతులపార్టీ అని టీడీపీనేత ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం దళితులపై సాగిస్తున్న దమనకాండను నిరసిస్తూ, తిరుపతి వేదికగా టీడీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న “దళితుల ప్రతిఘటన” పేరుతో భారీకార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ట్లు రాజు తెలిపారు.