ముద్రగడ పద్మనాభం గురించి తెలియని వారు ఈ రాష్ట్రంలో ఉండరు. రాజశేఖర్ రెడ్డి వీర విధేయుడుగా ఉన్న ముద్రగడ పద్మనాభం, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో ఉంటే మాత్రం ఎందుకో కానీ ఆయన తట్టుకోలేరు. వెంటనే ఆయనకు కాపు ఉద్యమం గుర్తుకు వస్తుంది. చంద్రబాబు అధికారంలో లేకపోతే మాత్రం, అసలు ఆ ముఖ్యమంత్రులను ఇబ్బంది పెట్టకుండా, చక్కగా ఇంట్లో ఉంటారు. మొన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా ట్రైన్ తగల బెట్టే దాకా రెచ్చ గొట్టి వదిలి పెట్టారు. మాట్లాడితే, పళ్ళెం, గెరిటా పట్టుకుని వాయించే వారు. నిజంగా ఆయనకు కాపు ఉద్యమం పై చిత్తశుద్ధి ఉండి, ఇలా చేస్తే, ఆయనకు మద్దతు ఇవ్వాల్సిందే. అందులో సందేహమే లేదు. చంద్రబాబు కాపు కార్పొరేషన్ పెట్టారు, కాపు రిజర్వేషన్ ఇచ్చారు, ఎన్నో కాపులకు చేసినా, అవేమీ పట్టించుకోని ముద్రగడ, చంద్రబాబుని రాజకీయం బాగా ఇబ్బంది పెట్టారు. దానికి తోడుగా, కులాల మధ్య కుంపట్లు పెట్టే సైకో బ్యాచ్ ఉండటంతో, ముద్రగడ లాంటి వారి అవసరం వారికి చాలా ఉపయోగ పడింది. పోనీ ముద్రగడలో ఉద్యమం పై ఆ నిజాయతీ ఉందా అంటే, అసలు సమస్య ఇక్కడే వస్తుంది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, ఆయన ఉద్యమం లేదు, ఏమి లేదు, నా వల్ల కాదని చెప్పేసారు.
జగన్ మోహన్ రెడ్డి, కాపు రిజర్వేషన్ ఎత్తివేసినా సౌండ్ లేదు. జగన్ మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వకపోయినా ముద్రగడ అడ్డ్రెస్ లేరు. అయితే గతంలో చంద్రబాబుని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన ముద్రగడ, ఈ మధ్య రాస్తున్న ఉత్తరాలు చూస్తుంటే, గతంలో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు అని తలుచుకుని జాలి పడటం తప్ప ఏమి చేయలేం. తాజగా ముద్రగడ జగన్ కు రాసిన లేఖ చూస్తే, షాక్ అవ్వాల్సిందే. కోడి పందేల కోసం, ముద్రగడ జగన్ కు లేఖ రాసారు. సంక్రాంతి పండుగలో కోడి పందేలు వేసుకోవాలని, అందుకు పర్మిషన్ ఇవ్వాలని లేఖ రాసారు. పోలీసులు ఇబ్బందులు పెట్టకుండా చూడాలని కోరారు. 5 రోజులు పాటు, పర్మిషన్ ఆర్డర్ ఇప్పించాలని కోరుతున్నానని ఆ లేఖలో తెలిపారు. ఆడుకునే వారిని ఆడుకోనివ్వాలని, జైలుకి పంపించ వద్దని కోరారు. అయితే ముద్రగడ లేఖ పై, సోషల్ మీడియాలో పోస్ట్ లు పడుతున్నాయి. ఎలాంటి ఆయన, ఎలాంటి ఉత్తరాలు రాస్తున్నాడు అంటూ, సెటైర్ లు పేలుతున్నాయి.