ఎన్నికల ముందు వరకు చంద్రబాబుని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి, సోషల్ ఇంజనీరింగ్లో చంద్రబాబుని ఓడించటంలో, సూపర్ సక్సస్ అయిన ముద్రగడ, మళ్ళీ ఆక్టివ్ అయ్యారు. మొన్నటి వరకు చంద్రబాబుకి ఉత్తరాలు రాసిన ముద్రగడ, ఇప్పుడు జగన్ కు ఉత్తరాలు మొదలు పెట్టారు. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డికి ఉత్తరం రాసారు ముద్రగడ. ఈ లేఖలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి ప్రస్తావించారు. 2019 ఎన్నికల్లో మా కాపు కులానికి చెందిన పార్టీని కూడా కాదనుకుని, తమ కాపు కులం ఓటర్లు అందరూ, మీకే ఓటేశారని ముద్రగడ, జగన్ కు గుర్తు చేసారు. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీని ఆయన ఇక్కడ పరోక్షంగా ప్రస్తావించారు. మా కాపు జాతికి మీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్ముతున్నామని ముద్రగడ అన్నారు. కాపు కులానికి న్యాయం చేయాలని ముద్రగడ జగన్ కు రాసిన లేఖలో కోరారు. కాపు రిజర్వేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రపదేశ్ లో కాపులు అందరూ మీకే ఓటు వేసారని అన్నారు. ఇది గుర్తించి, కాపులకు న్యాయం చెయ్యాల్సిన బాధ్యత మీపై ఉందని ముద్రగడ అన్నారు. గత ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్ల ఇస్తూ ప్రక్రియ ప్రారంభించిందని, ఆ ప్రక్రియను పూర్తి చేయాలని జగన్ కు విజ్ఞప్తి చేశారు. ఉన్నత కులల్లలోని పేదలకు కేంద్రం ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అందులో 5 శాతం కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని, తన లేఖలో జగన్ ను ముద్రగడ పద్మనాభం కోరారు. అయితే ఈ లేఖలో, పరోక్షంగా జనసేన పార్టీని కాపు పార్టీ అని చెప్పటం పట్ల, జనసేన పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరో పక్క కాపులకు రిజర్వేషన్ లు కుదరదు అని చెప్పిన జగన్, ముద్రగడ లేఖ పై ఎలా స్పందిస్తారో మరి.