ఆంధ్రప్రదేశ్ లో ముద్రగడ పద్మనాభం అంటే తెలియని వారు ఉండరు. చంద్రబాబు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ ఉద్యమ పోరాటం అంటూ తెగ హడావిడి చేసే వారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా పెద్ద రచ్చ చేసేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయన తీరు మరోలా ఉందని విమర్శలు ఎదుర్కుంటున్నారు. అప్పుడు అంతలా రచ్చ చేసిన ముద్రగడ ఇప్పుడు మాత్రం వైసీపీ ప్రభుత్వం ఏకంగా రిజర్వేషన్లు తీసేసినా ఎందుకు ఏమి మాట్లాడటం లేదని సర్వత్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఆ విమర్శలను తాను ఎదుర్కోలేనని, అందుకే తాను కాపు రిజర్వేషన్ ఉద్యమ పోరాటం నుంచి తప్పుకునుంటున్నానని స్యయంగా ప్రకటించుకున్నారు. ఆ రోజు నుంచి కనీసం కాపులను ఉద్దేశించి గాని, రిజర్వేషన్లు గురించి గాని మాట్లాడటం లేదు.పైగా ఆయన చేస్తున్న పని ఏంటంటే, కోడి పందేలు గురించి జగన్మోహన్ రెడ్డికి, అదేదో జాతీయ సమస్య గురించి ప్రధాని మోడికి లేఖలు రాసినట్టు రాస్తున్నారు. అయితే ఇప్పుడు ముద్రగడ మళ్ళీ రాజకీయంగా అలెర్ట్ అవుతున్నారు. తాజాగా ముద్రగడ పద్మనాభం ఇంటికి కొంతమంది నేతలు తరుచుగా వస్తున్నారు. కాని వచ్చే వారు అంతా కాపు నేతలు కాదని, ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గానికి సంభందించిన నేతలని ముద్రగడ వర్గం చెప్తుంది.
ముద్రగడను కొత్త పార్టీ పెట్టమని కోరారని,ఆయన పార్టీ పెడితే ఎస్సీ,ఎస్టీ, బీసీ అందరు నేతలు ఆయనకు అండగా ఉంటారని అందుకే ఆయన్ను కలవటానికి తరచుగా వస్తున్నారని అయన అనుచరులు చెప్తున్నారు. కాని ఇప్పుడు ఆయన కొత్త సొంత పార్టీ పెడితే కాపు సామాజిక వర్గం ఎంత వరకు నమ్ముతుందో చూడాలి. ఒకప్పుడు తను కాపు ఉద్యమ నేతంటూ హడావిడి చేసిన ఈయన ఇప్పుడు కనీసం ఆ విషయం పై నోరు మెదపక పోవడం పై కాపు వర్గం కూడా అసహనం గానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇదివరకు బాగా ఇమేజ్ ఉన్నప్పుడే పోటి చేస్తేనే 10వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, ఇప్పుడు మళ్ళీ పార్టీ అంటే సొంత వర్గమే నమ్మదు, ఇంకా మిగతా వర్గాలు ఏమి నమ్ముతాయి, అనే విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, విశ్లేషకులు మాత్రం, ఇదంతా ఒక పధకం ప్రకారమే,ఇలాంటి రాజికీయాన్ని మొదలు పెట్టారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గ ఓట్లను చీల్చటానికే ఇలా కొత్త పార్టీ అంటూ మొదలు పెట్టారని కూడా విమర్శిస్తున్నారు. తెలుగుదేశం బలపడుతూ ఉండటంతో, దానికి విరుగుడుగా, జగన్ వేసిన పాచిక అనే ప్రచారం కూడా జరుగుతుంది.