ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు, సినిమాలు ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి. అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టి అధికారంలోకి రావటం, తరువాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ పార్టీలు పెట్టినా ప్రజల మద్దతు పొందలేక పోవటం తెలిసిందే. ఇక బాలయ్య, రోజా, ఇలా అనేక మంది సినీ తారలు రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏపిలో సినిమా పరిశ్రమను తోక్కేస్తున్నారు అనే వివాదం నడుస్తుంది. కావాలని సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కేవలం కొంత మంది చిరంజీవిని వేసుకుని, వాళ్ళ స్వర్ధ్య ప్రయోజనాలు చూసుకుంటున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. సినిమా టికెట్లను మేము కాదు, చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్ళు అమ్మమంటేనే అమ్ముతున్నాం అని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ క్రమంలో, నిన్న జరిగిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తన ప్రసంగం మొత్తం వైసీపీని టార్గెట్ చేసుకుని మాట్లాడారు. సినిమా టికెట్లను ప్రభుత్వం అమ్మటం, సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండటం, ఇలా అనేక అంశాల పై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్, రాజకీయ అంశాలు కూడా కలిపి, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, అలాగే కొంత మంది వైసీపీకి అతిగా మద్దతు ఇచ్చే వారిని కూడా విమర్శలు చేసారు. పవన్ ప్రసంగం రాజకీయంగా పెద్ద బాంబు అనే చెప్పాలి. పవన్ ని టార్గెట్ చేస్తూ, ఇప్పుడు వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

mudragada 26092021 2

మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నలు చూస్తే, ఆయన ముద్రగడను టార్గెట్ చేసారనే అభిప్రాయం ఉంది. టిడిపి హాయాంలో, కాపు రిజర్వేషన్ అంటూ ప్రతి రోజు హడావిడి చేసిన వాళ్ళు, ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు అంటూ పవన్ వేసిన ప్రశ్న, డైరెక్ట్ గా ముద్రగడను ఉద్దేశించే. మరి దీని పై ముద్రగడ ఏమి సమాధానం చెప్తారో చూడాలి. అలాగే పవన్ కళ్యాణ్ కోడి క-త్తి కేసు పైనా, ఇడుపులపాయ నేలమాళిగలు పైన, ఇలా అనేక అంశాల పై మాట్లాడారు. మంత్రి పేర్ని నానిని సన్నాసి అని, అవంతిని అరగంట విధ్వంసుడని, సంబోధించారు. అలాగే మోహన్ బాబుని కూడా టార్గెట్ చేసారు. వైసీపీ మీ చుట్టాలు అని చెప్పుకుంటారు కదా, మరి సినిమా టికెట్ల విషయంలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇప్పుడు సినిమా టికెట్లు, రేపు మీ విద్యా సంస్థల వరకు వస్తే, ఇలాగే చూస్తూ ఊరుకుంటారా అని పవన్ ప్రశ్నించారు. అయితే రాజకీయంగా చూసుకుంటే పవన్ ప్రసంగం హాట్ హాట్ గా ఉన్నా, ఈ మొత్తం అంశానికి కారణం అయిన చిరంజీవిని మాత్రం పవన్ వదిలేసారు. జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవి కలిసి, శాలువాలు కప్పుకుని, ఫోటోలు దిగి, చివరకు ప్రభుత్వం చిరంజీవి చెప్పారనే సినిమా టికెట్లు మేము అమ్ముతున్నాం అని చెప్పినా, అసలు సమస్యకు కారణం అయిన చిరంజీవిని మాత్రం, పవన్ ఏమి అనకవపోవటం హైలైట్. ఏది ఏమైనా పవన్ ప్రసంగం రాజకీయంగా సూపర్ హిట్ అనే చప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read