ప్లేటూ గరిటె విసిరేశాడు. కాపు ఉద్యమాన్ని తాడేపల్లి ప్యాలెస్‌కి తాకట్టు పెట్టేశాడు. ఎన్నికలు వచ్చే వేళకి ఉద్యమనాయకుడి ముసుగు తీసేసి, వైకాపా ప్రీపెయిడ్ ఆర్టిస్ట్ అని తనకి తానే సర్టిఫికెట్ ఇస్తున్నాడు ముద్రగడ పద్మనాభం. గత ఎన్నికలకి ముందు ఈబీసీల రిజర్వేషన్‌లో 5 శాతాన్ని కాపులకి కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేలకోట్లు కాపుల సంక్షేమానికి ఖర్చుచేసింది. అయినా కాపు రిజర్వేషన్లు పేరుతో టిడిపి అధికారం కోల్పోయేవరకూ ప్లేట్లు, గరిటెలు కొడుతూ డ్రామా ఆడిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం...వైకాపా అధికారంలోకి రావడంతోనే ప్లేటుగరిటెలు వదిలేసి అస్త్రసన్యాసం చేసేశారు. చంద్రబాబు కల్పించిన 5 శాతం రిజర్వేషన్ కాపులకి జగన్ ఎత్తేసినా నోరు మెదపలేదు. వైకాపా ప్రభుత్వంపై అన్నివర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో పుట్టలోంచి పాములా మెల్లగా బయటకొస్తున్నారు. కాపు ఓట్లు చీల్చి టిడిపి-జనసేనని దెబ్బకొట్టే వ్యూహంతో కుంభకర్ణుడి నిద్రవీడి రాజకీయ రంగ ప్రవేశప్రకటన చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వైకాపా కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ముద్రగడ పోటీ చేస్తారని సమాచారం. తాజాగా రాష్ట్ర ప్రజలకు రాసిన లేఖలో తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటించారు. త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. కాపు ఉద్యమం ద్వారా, రాజకీయాల్లో చేరి డబ్బు సంపాదించాలనే ఆలోచన తనకు ఎప్పుడు రాలేదన్నారు. తమ జాతి రిజర్వేషన్ ఉద్యమం జోకర్ కార్డులా అయిపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని పేకల్లో జోకర్‌లా మార్చింది తానేనని ముద్రగడకీ తెలిసిన విషయం. వైకాపా లైఫ్ అయితే, ముద్రగడ జోకర్ అనేది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో బహిరంగ రహస్యం. కానీ ఆయనేదో జాతి ఉద్ధారకుడిలా ఏమండి అంటూ దీర్ఘాలు తీస్తూ రాసే లేఖల్లో తెలుగుదేశంపై ద్వేషం, వైకాపాపై ప్రేమ కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటాయి. చాలా నీతి కబుర్లు చెప్పే ముద్రగడ 5 శాతం రిజర్వేషన్ కాపులకి ఇచ్చిన చంద్రబాబుపై ద్వేషం చిమ్ముతూ ఉద్యమించి విధ్వంసం సృష్టించి, అదే రిజర్వేషన్ ఎత్తేసిన జగన్ రెడ్డిపై ప్రేమ కురిపిస్తూ..ఉద్యమాన్ని మూటకట్టి, మూతి మూసుకుని కూర్చోవడం ఏ జాతి ప్రయోజనాల కోసమో ఏనాడూ ముద్రగడ మాట్లాడరు.
ముసుగు తీసేసిన ముద్రగడ.. జగన్ పిలుపు కోసం ఎదురు చూపులు..
Advertisements