తనను విమర్శిస్తూ కేసీఆర్ అక్కడ మాట్లాడితే, జగన్ ఇక్కడ ట్వీట్ చేస్తాడని, వీళ్లిద్దరినీ అభినందిస్తూ నరేంద్ర మోదీ ఫోన్ చేస్తారని ఏపీ సీఎం చంద్రబాబు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫెడరల్ ఫ్రంట్ లో చేరతానని కేసీఆర్ చెబుతున్నాడని, ’చేరండి.. నేషనల్ ఫ్రంట్ లో చేరండి.. డెమోక్రటిక్ అలయెన్స్ లో చేరండి.. బ్రహ్మాండం.. మేము కాదంటామా?’ అని సెటైర్లు విసిరారు. తన కథ మీకెవరికీ అర్థం కాదని, రాబోయే రోజుల్లో హైకమాండ్ స్కీమ్ అర్థమవుతుందని కేసీఆర్ అంటున్నారని, ఎన్నికలు అయ్యే వరకు అది ఎవరికీ అర్థం కాదుట అంటూ సెటైర్లు విసిరారు.

mugguru 311122018

కేసీఆర్ ఓ స్ట్రాటజిస్ట్ అని, అయితే ఆ స్ట్రాటజీలు, కుట్రలు, కుతంత్రాలు అన్నివేళలా పనిచేయవని విమర్శించారు. ‘మిమ్మల్ని మానసికంగా దెబ్బతీసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా?’ అని ప్రశ్నించగా, ‘నన్ను మానసికంగా ఎవరు దెబ్బతీస్తారు? నన్ను మానసికంగా దెబ్బతీసే శక్తి ఎవరికీ లేదు. ఎన్నో సంక్షోభాలు చూశాను’ అని ఆయన సమాధానమిచ్చారు. హుందాగా వ్యవహరించడాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని, ఇష్టానుసారం మాట్లాడొద్దని కేసీఆర్ కు చంద్రబాబు హితవు పలికారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి టీడీపీని తాను లాక్కున్నానని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ‘నేనేదో ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ లాక్కున్నానట! అప్పుడు నువ్వెక్కడున్నావు? నాతోనే ఉన్నారు కదా? ఏం మాట్లాడుతున్నారు? ఆ తర్వాతే కదా మీరు మంత్రి అయ్యారు? వైస్రాయ్ హోటల్ సిద్ధాంత కర్త ఆయనే కదా. నడిపించిందే ఆయన, ఆ విషయాలు ఆయనకు తెలియదా?’ అని ప్రశ్నించారు.

mugguru 311122018

‘హరికృష్ణ చనిపోయినప్పుడూ అంతే. ఆసుపత్రి, పోస్టుమార్టమ్, బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేయమని కోరాం. అందులో తప్పేముంది?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం చేసుకుని, ముందుకుపోదామని తాను కోరానని, దాన్ని వదిలిపెట్టి, కనీసం ఒక్కరోజు కూడా కేసీఆర్ సహకరించలేదని, ఏపీకి కేంద్రం కూడా సహకరించట్లేదని బాబు విమర్శలు గుప్పించారు. నోరుందని పారేసుకుంటే అందరూ పారేసుకోవచ్చని... హుందాతనం అనిపించుకోదన్నారు. కొన్ని విలువలు ఉంటాయని.. అధికారంలో ఉండే వ్యక్తులు హుందాగా మాట్లాడాలన్నారు. అసభ్యంగా మాట్లాడారని విమర్శించారు. విధానాలను విమర్శించుకోవచ్చన్నారు. ‘‘నా రాజకీయ జీవితమంతా.. చేసింది చెప్పడం.. ప్రజలను చైతన్యపరచడం లాంటివి మాత్రమే చేశానన్నారు. రాజకీయ విలువను పాటించాను. సంయమనంతో వెళ్లాను. చులకనగా మాట్లాడినా.. హేళన చేసినా... కానీ ఎక్కడా రాజీపడలేదు. కేసీఆర్ ఎక్కడ నుంచి ఊడిపడ్డారు. టీడీపీ నుంచి కాదా... రాజకీయ జీవితం ఇవ్వలేదా... నోటికొచ్చినట్టు మాట్లాడారు. పద్ధతిలేని విధానమా ఇది. ఉద్యమం ప్రారంభించి కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. ఆ తర్వాత 2009లో సీట్లు ఇవ్వనంటే పరిగెడుతూ వచ్చి ఎన్ని సీట్లంటే అన్ని సీట్లు తీసుకున్నావు. అది నిజం కాదా..? తెలంగాణ ఇస్తే.. కాంగ్రెస్‌లో కలిపేస్తా అన్నారు. ఆ తర్వాత ఏం చేశారు. ఇప్పడు ఇడియట్స్ అంటూ పద్ధతి లేకుండా మాట్లాడతున్నారు. రాజీవ్ గాంధీ ఐటీని తీసుకొచ్చిన విషయం నిజమే.. మరి జనార్దన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు. 1995 నుంచి నాతో పాటు మీరే ఉన్నారు కదా... మీకు తెలియదా? జన్మభూమి గురించి ఊరూరూ పోయి.. పొగిడి.. ఇప్పుడేం మాట్లాడుతున్నారు?’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read