ముకేష్ అంబానీ స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన ఒక కార్పొరేట్ దిగ్గజం... అలాంటి వ్యక్తి, ఈ రోజు తెలుగోడు దమ్ము ఏంటో చూసారు... చంద్రబాబు టెక్నాలజీ విప్లవం అంటే ఏంటో చూపించారు... ఆసియాలోనే అతి పెద్దదైన 66 అడుగుల పొడవైన వీడియో తెరపై.. దానిపై ఒకేసారి రాష్ట్రంలోని వందల ఊళ్లలోని సర్వెలైన్సు కెమెరాల నుంచి అక్కడ తాజా స్థితి ప్రత్యక్ష పసారం, మరోవైపు పరిష్కార వేదికద్వారా వందల మంది సిబ్బంది లక్షల్లో వస్తున్న ప్రజా ఫిర్యాదులపై స్పందిస్తున్న తీరు ప్రత్యక్షప్రదర్శన... ఇంకో వైపు పీపుల్స్ హబ్... ఈ ప్రగతి, తాళం వేసి ఉన్న ఇళ్లకు గస్తీ కాస్తున్న పోలీసు కెమెరా కళ్లు... వాతావరణ ప్రత్యక్ష స్థితి... ఒకటా, రెండా. ... అంబానీ ముందు ముందు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక వినియోగంలో తనకున్న అపార అనుభవపాఠ సోయగాన్ని ప్రదర్శించారు చంద్రబాబు...
ఇవన్నీ చూసిన అంబానీ ముగ్ధుడయ్యారు. ఇటువంటి టెక్నాలజీ విదేశాల్లోనే కాదు.. ఎక్కడా లేదన్నారు... చంద్రబాబుకి, రియల్ టైం గవర్నెన్స్ టీంకి అభినందంనలు తెలిపారు... ఇలాంటివి దేశమంతటా రావాలని, అన్ని రాష్ట్రాలు ఇలాంటి సెంటర్స్ పెట్టుకోవాలని అన్నారు... ఫైబర్ గ్రిడ్ ద్వారా గ్రామాల్లో ఫోన్, ఇంటర్ నెట్, టీవీ మూడు ఒకే వైర్ ద్వారా ఇవ్వడం చాలా అరుదైన విషయమని ముకేష్ అన్నారు. సుమారు గంటకు పైగా ఈ సమావేశంలో, చంద్రబాబు, లోకేష్, ఐఏఎస్ అహ్మద్ బాబు, రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ పని తీరుని వివరించారు...
దేశంలో మరే ఇతర రాష్ట్రం చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రియల్ టైమ్ గవర్నెన్స్ అమలు చేస్తోంది. ఇందు కోసం అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఇటీవల, ఈ సెంటర్ చూసి ఆశ్చర్యపోయారు... ఢిల్లీ వచ్చి అన్ని రాష్ట్రాలకి ప్రెజెంటేషన్ ఇవ్వాలని చంద్రబాబుని కోరారు... ఇలాంటి చంద్రబాబుని, బీజేపీ అనుకూల జాతీయ మీడియా, మన ఘనత వహించిన హైదరాబాద్ మీడియా ఇలాంటి విజయాలు చూపించవు... చంద్రబాబు ఎక్కడ కోపంగా ఉన్నారు, లోకేష్ ఎక్కడ నోరు జారారు, ఏ పోలీసు స్టేషన్ లో ఏ కేసు నమోదైంది, ఆ కేసుని అడ్డు పెట్టుకుని, ఆంధ్రప్రదేశ్ మీద ఎలా విమర్శలు చెయ్యాలి లాంటి వార్తలే వేస్తారు... మన ఖర్మకు, మన సొంత మీడియా ఎప్పుడు వస్తుందో...