ఆ రోజుల్లో టెలికాం రంగంలో రెవల్యుషన్ గురించి వాజ్ పేయ్ కి నేనే సలహా ఇచ్చా అంటే.ఎగతాళి చేసిన బ్యాచ్... 1999లో చంద్రబాబు ఇచ్చిన సలహా మేరకే రిలయన్స్ టెలికాం రంగంలోకి అడుగుపెట్టింది అని ముకేష్ అంబానీ చెప్తున్నారు వినండి.... ‘‘1999లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు జామ్‌నగర్‌లోని మా రిఫైనరీని సందర్శించారు. అప్పుడు మా నాన్న ధీరూబాయ్ అంబానీతో మాట్లాడారు. టెలికాం రంగంలోకి వస్తే బాగుంటుందని మాకు సలహా ఇచ్చారు. ఆ రంగం ఊహించనంత ఎదుగుతుందని చెప్పారు. ఆ సలహాతోనే మా నాన్న టెలికాంవైపు అడుగు వేశారు. ఆ రకంగా రిలయన్స్ కంపెనీ చంద్రబాబుకు రుణ పడి ఉండాలి’’ అంటూ ప్రశంసలు కురిపించారు.
రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం గురించి మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధానిని వెళ్లి రియల్ టైమ్ గవర్నెన్స్‌ను పరిశీలించాలని విజ్ఞప్తిచేస్తే తనకు ఆసక్తి కలిగిందని, ఇప్పుడు సందర్శించే అవకాశం వచ్చిందని పారదర్శక పరిపాలన, జవాబుదారీతనంతో ప్రభుత్వాలు వ్యవహరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న రియల్ టైమ్ విధానం అపూర్వమన్నారు. రెవెన్యూ విభాగంలో తీసుకొచ్చిన సంస్కరణలను ప్రధానంగా భూవివరాలను ఆన్‌లైన్ లో వుంచిన విధానం, భూదార్‌లపై అంబాని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ లో మంగళవారం భూగర్భజలాలు సగటున 11.3 మీటర్ల స్థాయిలో ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించినప్పుడు ముకేశ్ అంబానీ ప్రశంసాపూర్వకంగా చూశారు.
ఇలాంటి చంద్రబాబుని పట్టుకుని, బొడ్డు కూడా సరిగ్గా ఊడని బచ్చాగాళ్ళు ఆయన్ను ఎగతాళి చేస్తూ ఉంటే, ఆయన చూస్తూ ఊరుకున్నాడు.... అమెరికా తరువాత మైక్రో సాఫ్ట్ హైదరాబాద్ తెచ్చింది నేనే అంటే ఎగతాళి చేసారు... చివరకు స్వయానా మైక్రో సాఫ్ట్ అధినేత వైజాగ్ వచ్చి, ఆ రోజుల్లో చంద్రబాబు పడిన కష్టం చెప్పి, హైదరాబాద్ రావటానికి చంద్రబాబు ఏమి చేసింది చెప్పారు... ఈ బచ్చా గాళ్ళ నోరు మూపించారు... అలాగే హైదరాబాద్ ఐటి నా పుణ్యమే అంటే ఎగతాళి చేసారు... చివరకు ప్రత్యర్ధి అయిన తెలంగాణా ఐటి మంత్రి కేటీఆర్ స్వయంగా, హైదరాబాద్ ఈ రోజు ఐటిలో ఇలా ఉంది అంటే చంద్రబాబు చలవే అని ఒప్పుకున్నారు.... ఈ బచ్చా గాళ్ళ నోరు మూపించారు... ఆ రోజుల్లో టెలికాం రంగంలో రెవల్యుషన్ గురించి వాజ్ పేయ్ కి నేనే సలహా ఇచ్చా, సెల్ ఫోన్ లు తీసుకురమ్మంది నేనే అంటే ఎగతాళి చేసారు, ఈ రోజు ముకేష్ అంబానీ స్వయంగా చెప్పారు "1999లో చంద్రబాబు ఇచ్చిన సలహా మేరకే రిలయన్స్ టెలికాం రంగంలోకి అడుగుపెట్టింది అని"... మళ్ళీ ఈ బచ్చా గాళ్ళ నోరు మూపించారు... మీరే ఈ కింద వీడియోలో వినండి... అది చంద్రబాబు స్థాయి... సోషల్ మీడియాలో సునకానందం కోసం వీడియోలు చేసి, ఆయన్ని కించపరిస్తే, ఆకాశం మీద ఉమ్మినట్టే అని ఈ బచ్చా గాళ్ళు గుర్తు పెట్టుకోవాలి...