ఈ రోజు అమరావతికి దేశ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ లాంటి మహా సంస్థకు అధినేత ముఖేశ్‌ అంబానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి రానున్నారు... ఇవాళ అమరావతిలో పర్యటించనున్న ముఖేష్ అంబానీ.. సాయంత్రం దాదాపు రెండు గంటల పాటు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు... ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వీరి మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది... రాష్ట్రంలో పెట్టుబడులుకు ఉన్న అవకాశాలు ఇప్పటికే స్టడీ చేసిన రిలయన్స్ గ్రూప్, ఏ రంగంలో పెట్టుబడులు పెడతారో అని ప్రభుత్వ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి..

velagapudi 13022018

ఖ మంత్రి నారా లోకేశ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇటీవల తన ముంబై పర్యటనలో భాగంగా అంబానీని కలిసిన మంత్రి లోకేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించి రాష్ట్ర పర్యటనకు రావాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఇవాళ అంబానీ సీఎంతో భేటీ కానున్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ఆర్టీజీ కేంద్రాన్ని ముఖేష్ అంబానీ పరిశీలించనున్నారు.

velagapudi 13022018

అధికారిక కార్యక్రమాలు అయిపోయిన తరువాత, ముఖ్యమంత్రి నివాసంలో విందు భేటీలోనూ ముఖేష్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.. ఈ భేటీలో పారిశ్రామిక రంగంతో పాటు, తాజా రాజకీయ పరిణామాలు కూడా చర్చించే అవకాసం ఉంది... ఇటీవల చంద్రబాబు, బీజేపీకు దూరం అవుతున్నారు అనే సంకేతాలు, దేశ వ్యాప్తంగా బలంగా వెళ్ళిన నేపధ్యంలో, ఆ విషయాలు పై కూడా, ఇరువురి మధ్య చర్చకు వచ్చే అవకాసం ఉంది... మొత్తానికి ముకేష్ అంబానీ ఎలాంటి పెట్టుబడులు పెడతారు, ఎంత పెడతారు అనే దాని పై, ఆసక్తి నెలకొంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read