తెలుగుదేశం నేతలు టార్గెట్ గా, జగన్ సర్కార్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎవరు మాట వినకపోతే, ఎవరు తమ పార్టీలో చేరకపొతే వారిని టార్గెట్ చేస్తున్నారు అంటూ, టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలు నిజం అవుతున్నాయి. ఈ కో-ర-నా సెకండ్ వేవ్ లో ప్రజలు అల్లాడిపోతుంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం, టిడిపి నేతలను టార్గెట్ చేసింది. మొన్న చంద్రబాబు, నిన్న నరేంద్ర, పల్లా శ్రీనివాస్, నేడు మురళి మోహన్. అయితే వీరందరూ ప్రభుత్వం చర్యల పై న్యాయ స్థానాల్లో పోరాడుతున్నారు. వీరి పై అభియోగాలు మోపోతున్నారు కానీ,ఆధారాలు ఇవ్వలేక పోవటంతో, కోర్టుల్లో కూడా ఎదురు దెబ్బే తగులుతుంది. అయితే ఇప్పుడు తాజాగా సీనియర్ నటుడు, టిడిపి మాజీ ఎంపీ మురళి మోహన్ కు షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. పోయిన ఎన్నికల్లో మురళీ మోహన్ పోటీ చేయకుండా, ఆమె కోడలుకు అవకాసం ఇవ్వగా, ఆమె ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే మురళీమోహన్ కూడా జయభేరి కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఉంది. హైదరాబాద్ తో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల జయభేరి కన్స్ట్రక్షన్స్ పేరుతో నిర్మాణాలు చేస్తూ ఉంటారు. అలాగే మంగళగిరిలో కూడా జయభేరి కన్స్ట్రక్షన్స్ పేరుతో అపార్ట్ మెంట్ ల నిర్మాణం జరుగుతుంది.
2016 నుంచి ఆ నిర్మాణాలు మంగళగిరిలో జరిగాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని అయిన తరువాత, మంగళగిరి ప్రాంతంలో డిమాండ్ పెరగటంతో, అక్కడ నిర్మాణాలు మొదలు పెట్టారు. ఇప్పటికే చాలా వరకు పురయ్యాయి కూడా. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, రెండేళ్ళ తరువాత, అక్కడ నిర్మాణాలు చేసిన భూమి వ్యవసాయ భూమి అంటూ, జయభేరి కన్స్ట్రక్షన్స్ కు భారీ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయి అంటూ, జయభేరి కన్స్ట్రక్షన్స్ కు కోటిన్నర రూపాయలు జరిమానాగా విధించారు. ఏడు ఎకరాల్లో నిర్మాణం అయిన నిర్మాణాలు చేసిన ఈ భూమి, వ్యవసాయ భూమి అని, దాన్ని కమర్షియల్ ల్యాండ్ గా మార్చకుండా నిర్మాణాలు చేసారు అంటూ, మూడు శాతం వరకు ల్యాండ్ కన్వర్షన్ తో పాటుగా, జరిమానా కూడా విధించారు. అయితే ఈ జరిమానా పై జయభేరి కన్స్ట్రక్షన్స్ నుంచి ఎటువంటి వివరణ ఇంకా రాలేదు. ఈ జరిమానా పై కోర్టు కు వెళ్తారా ? అసలు వాస్తవాలు ఏంటి ? ఇది కూడా కక్ష సాధింపులో భాగమేనా అనేది తెలియాల్సి ఉంది.