నాడు నేడు పధకం మొత్తం బూటకం అంటూ వ్యాఖ్యలు చేసారు టిడిపి నేత, మాజీ మంత్రి కే.ఎస్.జవహర్. ఆయన మాట్లాడుతూ, "విద్యా శాఖలో విద్యా వంతులు వస్తే ఆ శాఖ బాగుపడుందని అందరూ భావించారు. కాని నేడు విద్యా శాఖకు మంత్రిగా ఆదిమూలపు సురేష్ రావడంతో మొత్తం విద్యా వ్యవస్థనే బ్రష్టుపట్టించారు. నేడు నేడు అనే బోగస్ పథకాన్ని మంత్రి బుజాన వేసుకొని తిరుగుతున్నారు. నాడు చంద్రబాబు నాయుడు గారు కి.మీ. లోపు పాఠశాలలను నిర్మించి విద్యార్ధులకు విద్యను అందిస్తే నేడు విద్యా శాఖ పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. నాడు టీడీపీ హయాంలో కట్టిన పాఠశాలలకు నేడు రంగులు వేసుకుంటున్నారు. నాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారి మీద యూనివర్సిటీ పెడితే నేడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు అని పేరు మార్చుకున్నారు. నాడు నేడు పేరుతో జగన్ రెడ్డి బినామీలకు కమీషన్లు దోచిపెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాల్లలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, 15 శాతం బడుల్లో మంచినీటి కోసం ఇబ్బంది పడుతున్నారని నిన్న కేంద్ర విద్యా శాఖ చెప్పింది. నాడు నాణ్యమైన విద్యలో 3 వస్థానం నుంచి నేడు 19వ స్థానానికి దిగజార్చారు. ఆదిమూలపు సురేష్ మంత్రికి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ. కామన్ స్కూల్ విధానం లేదు. మాతృభాష బోదనలో విలువ తెలియని వ్యక్తి నేడు విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్, విదేశీ విద్య, కార్పొరేట్ కళాశాల్లో చదువుకునే వెసులుబాటులు ఇప్పుడేమయ్యాయో తెలియదు. "

nadu 02072021 2

"విద్యావ్యవస్థను బ్రష్టుపట్టిస్తున్నారు. నాడు నేడు పథకం ద్వారా ఉపాధ్యాయులు ఎంత మంది చనిపోయారో లెక్కచెప్పాలి. కరోనా ఎంత మంది ఉపాధ్యాయులను ఆదుకున్నారో చెప్పే దమ్ము ప్రభుత్వం దగ్గర ఉందా? అమ్మ ఒడి తో 80 లక్షల మంది విద్యార్ధులకు ఇవ్వాల్సింది. 44 లక్షల మందికి కుదించారు. ఉపాధ్యాయుల రిక్రూట్ మెంట్, డీఎస్సీల విషయంలో నాడు చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా ఉంటే నేడు జగన్ రెడ్డి కన్ఫూజ్ అవుతున్నారు. మొన్నటి వరకు పరీక్షల పేరుతో పిల్లలను భయబ్రాంతులకు గురి చేశారు. సుప్రీంకోర్టు చివాట్లు పెడితేగాని రద్దు చేయలేదు. ప్రశ్నించి లోకేష్ గారిపై అనవసరంగా నిందలు వేశారు. ఆదిమూలపు సురేష్, జగన్ రెడ్డిలను మానసిక డాక్టర్ల దగ్గర చికిత్స చేయించాలి. విద్యా శాఖ కమీషనర్ చిన వీరభద్రుడు కూడా ప్రశ్నించిన వారిపై మెమోలు ఇస్తున్నారు. కమీషనర్ గా తన బాధ్యతను విస్మరిస్తున్నారు. విద్యా శాఖలో చాలా మంది మేథావులు ఉన్నాయి వారి ఆలోచనలు ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదు." అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read