పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, పవన్ రాజకీయం పై స్పందించారు. ఈ స్పందించిన తీరు అయితే జబర్దస్ట్ కామెడీని మించి ఉంది. జబర్దస్ట్ కామెడీలో రోజా ఎలా నవ్వుతుందో, అలా నవుతున్నారు ప్రజలు. నిజానికి, జనసేన అధినేత పవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఒక పార్టీ అధినేతగా జగన్ స్థాయికి తగిన వ్యాఖ్యలు కావని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు నోరు జారకూడదని, తొందరపాటులో ఎలా పడితే అలా మాట్లాడకూడదని తెలిపారు. పవన్ వివాహానికి సంబంధించి సరైన అవగాహన లేకుండా జగన్ మాట్లాడారని వ్యాఖ్యానించారు.
పవన్ ఎవరినీ పెళ్లి చేసుకుంటానని.. నమ్మించి మోసం చేయలేదన్నారు. ఇద్దరి భార్యల నుంచి విడాకులు తీసుకోవడానికి కారణమేంటనేది భార్యాభర్తల మధ్య జరిగిన విషయమని.. పవన్ చట్టబద్ధంగానే విడాకులు తీసుకున్నాడని.. దీనిపై ఎలాంటి వివాదం లేదన్నారు. పవన్ మొదటి భార్య గానీ, రేణూ దేశాయ్ గానీ ఎక్కడా మాట్లాడిన సందర్భాలు లేవని నాగబాబు చెప్పుకొచ్చారు. చట్టబద్ధంగా విడిపోయి.. న్యాయంగా బతుకుతున్న వ్యక్తిపై ఎందుకిలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పెళ్లిళ్లు చేసుకుని అక్రమ సంబంధాలు నడిపితే తప్పు లేదా అని వ్యాఖ్యానించారు.
పవన్‌ను విమర్శించడం వెనుక పొలిటికల్ అజెండా ఉందన్నారు. పవన్‌ను రాజకీయంగా విమర్శించడానికి అవకాశం లేకపోవడంతో వైవాహిక జీవితం గురించి మాట్లాడుతున్నారని నాగబాబు చెప్పారు. వైవాహిక జీవితంలో కూడా పవన్ ఎవరికీ అన్యాయం చేయలేదన్నారు. జగన్ అభద్రతా భావంతో ఉన్నారని, అందువల్లే అలా మాట్లాడుతున్నారన్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఎవరికీ ఇబ్బంది లేదు కాని, ఇక్కడే నాగబాబు చెప్పిన విషయం విని, అందరూ నవ్వారు. కల్యాణ్‌ను టీడీపీ, వైసీపీ తక్కువ అంచనా వేశాయని అభిప్రాయపడ్డారు. ఏపీలో పవన్ బలమైన రాజకీయ శక్తిగా మారుతున్నాడన్నారు. చంద్రబాబు దిగటం ఖాయం అంటూ నాగబాబు స్పందించారు. ఇది కామెడీనో కాదో, ఇక మీరే డిసైడ్ చెయ్యాలి.