ఇవాళ రాజధాని అమరావతిలో మరో భారీ సదస్సు జరగుతున్న విషయం తెలిసిందే. గుంటూరులోని, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాయంలో నాలుగు రోజుల పాటు జరిగే భారత ఆర్థిక సంఘం (ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్) శతాబ్ది ఉత్సవాలను, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. అయితే, నాగార్జున యూనివర్సిటీ అంటే చాలా మందికి యాంటీ సెంటిమెంట్! నేతలు ఎవరికైన మన దేశంలో యాంటీ సెంటిమెంట్ ఎక్కువే. ఫలానా చోటకు వెళితే పదవులు పోతాయని తెలిస్తే.. ఆ ప్రాంతాన్ని కన్నెత్తి కూడా చూడరు. తెలుగు రాష్ట్రాల్లో ఈ యాంటీ సెంటిమెంట్ ఫోబియా ఎక్కువే.
నాగార్జున యూనివర్సిటీకి గొప్ప పేరుంది. కానీ, ఈ వర్సిటీలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అధికారులు, నేతలు భయపడతారు. ఒక్కసారి వర్సిటీకి వెళ్లి వస్తే పదవీ గండం ఉంటుందన్నది వారి భయానికి కారణం. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి వర్సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి గేటుదాకా వచ్చి వెనక్కి వెళ్లిపోయారు. అక్కడకు వెళ్తే పదవీ గండం అని స్థానిక నేతలు చెప్పటంతో వైఎస్ వెనక్కుతగ్గారు. అలాగే కొంత మంది ఉన్నతాధికారులు కూడా వర్సిటీకి వెళ్ళాలి అంటే భయపడతారు. అందుకే అంత పెద్ద యూనివర్సిటీ ఉన్నా, అక్కడ ఏ అధికారిక కార్యక్రమం పెట్టరు.
కాని వీరికి విభిన్నంగా ప్రవర్తించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వెళితే పదవి పోతుందనే ప్రచారం ఉంది. కానీ, ఆయన అక్కడికి వెళ్లారు. భారీ నేషనల్ సదస్సు నిర్వహిస్తున్నారు. మనం చేసే పని ముఖ్యం, మన రాష్ట్రానికి పేరు రావటం ముఖ్యం, మన అమరావతి అందరి నోట నానటం ముఖ్యం, ఇక్కడే సదస్సు నిర్విహించండి, రాష్ట్రపతితో పాటు, దేశ విదేశీ ప్రముఖులు వస్తారు అంటూ, యాంటీ సెంటిమెంట్ బ్రేక్ చేసి మరీ, ఇక్కడ సదస్సు నిర్వించారు చంద్రబాబు. ఇది పదవి కోసం సెంటిమెంట్ ఫాలో అయ్యేవారికి, పనే ముఖ్యం అనుకునే చంద్రబాబుకి తేడా... ఇంకా ఎవరన్నా సెంటిమెంట్ అంటే చెప్పండి, హేతువాది "బాబు గోగినేని" దగ్గరకు తీసుకువెళ్ళి జ్ఞానోదయం చేపిద్దాం.