ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయన్నమాటే గానీ... రాజకీయ పార్టీలకు ప్రశాంతత కరువైంది. ఎన్నికల ముందు ఎలా టెన్షన్ పడ్డాయో... ఇప్పుడూ అలాగే పడుతున్నాయి. ఇప్పుడెందుకంటే... 43 రోజులు స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంలు భద్రంగా ఉంటాయో లేదో అన్న టెన్షన్. ఎప్పుడైనా ఎవరైనా దాడి చేసి... వాటిని ఎత్తుకుపోతారేమోనని స్వయంగా రాజకీయ పార్టీలే తమ ప్రతినిధులను కాపలాగా పెట్టుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో... ఓ సంఘటన తీవ్ర కలకలం రేపింది. గుంటూరులో స్ట్రాంగ్‌ రూమ్‌లలో నిబంధనల ఉల్లంఘన పై ఎన్నికల సంఘానికి టీడీపీ నేతల ఫిర్యాదు చేశారు. నాగార్జున వర్శిటీలో స్ట్రాంగ్‌రూమ్‌లలోకి వైసీపీ నేతలతో ఉద్యోగులు వెళ్లారని ఫిర్యాదులో నేతలు పేర్కొన్నారు.

strongroom 22042019

నాగార్జున వర్శిటీలో ఈవీఎంల పరిశీలనకు వైసీపీ నేతలతో పాటు ఉద్యోగులు వెళ్లడంపై అభ్యంతరం తెలిపారు. వైసీపీ అభ్యర్ధులతో వర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ డీన్ శ్రీనివాసరెడ్డి, మరో ఉద్యోగి వెళ్లారని ఫిర్యాదు చేశారు. వర్శిటీ డీన్‌ శ్రీనివాసరెడ్డి, వెంకటరామిరెడ్డి, ఐవైఆర్‌ కృష్ణారావు, అజేయ కల్లాంతో కలిసి పనిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలతో కలిసి పనిచేస్తున్న వర్శిటీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని నేతలు అనుమానం వ్యక్తం చేశారు. అసలే ఎన్నికల కమిషన్‌పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇలాంటి సమయంలో స్ట్రాంగ్‌రూమ్‌ తెరిచి ఏకంగా వైసీపీ నేతలే లోపలకి వెళ్ళటం వివాదాస్పదంగా మారింది.

strongroom 22042019

కొన్ని రోజుల క్రితం, మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ను తెరిచారు. అందులో నుంచి ఈవీఎంలను వాహనాల్లో తరలించారు. కలెక్టర్‌, పార్టీల ప్రతినిధులు లేకుండానే స్ట్రాంగ్‌రూమ్‌ సీలు తీసి, తలుపులు తెరిచి మూడు టాటా ఏస్‌ వాహనాల్లో ఈవీఎంలను తరలించారు. దీనిపై కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ను సంప్రదించగా... ‘‘అవి నూజివీడు నియోజకవర్గానికి చెందిన రిజర్వు ఈవీఎంలు. ఆ నియోజకవర్గ రిటర్నింగ్‌ ఆఫీసర్‌, సబ్‌ కలెక్టర్‌ స్వపిన్‌ దినకర్‌ ఆధ్వర్యంలో వాటిని తరలించాం’’ అని తెలిపారు. 103 రిజర్వు ఈవీఎంలను ఇతర రాష్ట్రాల్లో వినియోగించుందుకు వీలుగా అక్కడి నుంచి తరలించామని, ఇందులో వివాదమేదీ లేదని సబ్‌ కలెక్టర్‌ కూడా తెలిపారు. అన్ని పార్టీల ప్రతినిధులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారు ఎవరూ రాలేదని చెప్పారు. ఇప్పుడు గుంటూరు నాగార్జున యూనివర్సిటీ సంఘటన కలకలం రేపుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read