నవ్యాంధ్రకి కేంద్రం చేస్తున్న అన్యాయం పై, రాష్ట్రంలో ప్రతి ఒక్కరి, వారికి తోచిన విధంగా నిరసన తెలియచేస్తున్నారు... ఇటు రాజకీయ పార్టీల నుంచి సామాన్య ప్రజల దాకా, అందరూ కేంద్రం పై ఆందోళన బాటలో ఉన్నారు... ఇదే సందర్భంలో విజయవాడకు చెందిన కిలారు నాగ శ్రవణ్, కేంద్రం పై తన నిరసన తెలియచేయటంలో, తనదైన శైలిని ఎంచుకున్నారు... విజయవాడకు చెందిన నాగ శ్రవణ్ సమాజం పట్ల తన బాధ్యతగా వివిధ అంశాల పై స్పందిస్తూ, విజయవాడ నీడ్స్ యు అనే సంస్థ ద్వారా, సమాజంలో లోపాలు, వసతుల కల్పన, పాలసీల అమలులో నిర్లక్షం, ప్రభుత్వ విధానాల పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారు..
ఇదే సందర్భంలో, నాగ శ్రవణ్ చేస్తున్న పని గుర్తించింది కేంద్ర ప్రభుత్వం... నాగ శ్రవణ్ 2015- 16 సంవత్సరానికి జాతీయ యూత్ అవార్డు గెలుపొందారు... యూత్ అవార్డు పొందిన వారికి భారత ప్రభుత్వం రూ.50,000 నగదు బహుమతి అందజేసింది... అయితే నాగ శ్రవణ్ మాత్రం, ఈ అవకాశాన్ని కేంద్రం పై నిరసన తెలియచేయటానికి ఉపయోగించుకున్నారు... రాష్ట్రం పై, కేంద్రం చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా, తనకు వచ్చిన రూ.50,000 నగదు బహుమతిని అమరావతి రాజధాని నిర్మాణానికి ఇచ్చి, తన నిరసన తెలియ చేసారు... రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి, తనకు బహుమతిగా వచ్చిన 50 వేలు, తన నేషనల్ యూత్ అవార్డు కు తిరిగి ఇచ్చేసారు.
అలాగే నాగ శ్రవణ్, ప్రజలని చైతన్య పరుస్తూ, ప్రధాన మంత్రి మోడీ గారికి, రాష్ట్రానికి న్యాయం చెయ్యాలని కోరుతూ, లక్ష పోస్ట్ కార్డులు రాసే క్యంపైన్ కూడా మొదలు పెట్టారు... ఆన్లైన్ పిటిషన్ ద్వార కూడా కేంద్రం పై నిరసన తెలియచేస్తున్నారు... ఇలాంటి యువకలు చేసే ఆందోళన, భావి తరాల భవిష్యత్తు కోసం.. ఇలాంటి వారిని అయిన చూసి, ప్రధాని కనికరిస్తారని ఆశిద్దాం.. https://www.change.org/p/prime-minister-of-india-justice-to-andhra-pradesh?recruiter=86554337&utm_source=share_petition&utm_medium=copylink&utm_campaign=share_petition