ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పని తీరులో, ఈ దఫా స్పష్టమైన మార్పు కనిపిస్తుంది... వయసుతో వచ్చే మార్పు కావచ్చు, ఆయన పాదయాత్ర అనుభవాలు కావచ్చు, కష్టం అని ఎవరు వచ్చినా, సహాయం చేసి పంపిస్తున్నారు చంద్రబాబు... అంతే కాదు, వారి యోగక్షేమాలు కూడా ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు... ఎప్పుడో చేసిన సాయం కూడా గుర్తు తెచ్చుకుని, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో అడిగి తెలుసుకుంటున్నారు... నిజానికి చంద్రబాబు ఏది తొందరగా మర్చిపోరు... అన్నీ గుర్తు ఉంటాయి ఆయనకు... పార్టీలో కూడా, గ్రామ స్థాయి కార్యకర్తను కూడా పేరు పెట్టి పిలిచే అంట జ్ఞాపకశక్తి ఆయనకు ఉంటుంది... ఇలాంటి అనుభవమే, ఇప్పుడు మంత్రి నక్కా ఆనందబాబుకి ఎదురైంది.. స్వయానా అయానే అనుభూతి పొందటంతో అవాక్కయారు మంత్రి...

nakka ananda babu 2210207 2

గుంటూరు జిల్లా, చుండూరుకు చెందిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, డీసీసీబీ డైరెక్టర్‌ గుదేటి బ్రహ్మారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ, హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆర్ధిక పరిస్థితి అంతఅంత మాత్రమే కావటంతో, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం అర్జీ పెట్టుకున్నారు. మంత్రి నక్కా ఆనంద బాబు నియోజకవర్గం కావటంతో, ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరకు ఈ విషయం కొన్ని రోజుల ముందు తీసుకెళ్ళారు... అయితే, కొన్ని సాంకేతిక కారణాలతో ముఖ్యమంత్రి ఆమోదించటం లేట్ అయ్యింది... ఇది ఇలా ఉండాగానే, ముఖ్యమంత్రి పది రోజుల విదేశీ పర్యటన నిమిత్తం, వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరే సమయంలో, అక్కడే ఉన్న మంత్రి నక్కా ఆనంద బాబు, ముఖ్యమంత్రికి వీడ్కోలు పలకటానికి వచ్చారు... 

nakka ananda babu 2210207 3

ఆ సందర్బంలో, విదేశాలకు వెళ్ళే ముందే, అనుకోకుండా పోలవరం పనుల నిమిత్తం, నాగపూర్ పర్యటన పెట్టుకున్న ముఖ్యమంత్రి చలా హడావిడిగా ఉన్నారు.. అయినా సరే, మంత్రి అడిగిన సాయం గుర్తుకువచ్చి, ఆ బాధితుడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.. ఇంకా పరిస్థితి అలాగే ఉందని తెలుసుకుని, రిపోర్ట్ లు అన్నీ పరిశీలించి, వెంటనే రూ.8 లక్షలు వైద్య ఖర్చుల కోసం విడుదల చెయ్యాలని ఆదేశాలిచ్చారు. 10 రోజుల దాకా రాను అని, ఈ లోప ఆ బాధితుడికి వైద్యం లేట్ అయితే ఇబ్బంది అని, చంద్రబాబు వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు... చంద్రబాబు ఇంత హడావిడిలో కూడా, ఒక సామాన్య ప్రజలు గురించి పట్టించుకుని, వెంటనే సమస్య పరిష్కారం చెయ్యటంతో, మంత్రి నక్కా ఆనంద బాబు ఆశ్చర్యపోయారు.. అంతే కాదు, తెల్లారే సరికి, 8 లక్షల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్ రెడీ అయిపోయింది. మంత్రి, ఆ చెక్కును బ్రహ్మారెడ్డి కుటుంబ సభ్యులకు అందిస్తూ సీఎం పని తీరును వారికి వివరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read