గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్‍బాబు ఇంటి వద్ద నేడు మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఆనంద్‍బాబు ఇంటికి భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. నిన్న రాత్రి నర్సీపట్నం పోలీసులు, ఆనంద్‍బాబుకు నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వచ్చారు. గంజాయి రవాణాకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు. స్టేట్‍మెంట్ ఇవ్వకుంటే 91 సీఆర్పీఎఫ్ కింద నోటీసులు ఇస్తామని, చింతపల్లి వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుందని నర్సీపట్నం సీఐ శ్రీనివాసరావు అన్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో నోటీసులు తీసుకునేందుకు  ఆనంద్‍బాబు నిరాకరించారు. దీంతో ఇవాళ మరోసారి నోటీసులు ఇస్తామని పోలీసులు వెళ్ళిపోయారు. ఈ రోజు మళ్ళీ పోలీసులు వస్తామనడంతో ఆనంద్‍బాబు ఇంటి వద్దకు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అనుకున్నట్టే పోలీసులు మళ్ళీ వచ్చారు. ఉద్రిక్త పరిస్థితి నేపధ్యంలో, నక్కా ఆనందబాబు నివాసం దగ్గర పోలీసుల మోహరించారు. టిడిపి శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఆనందబాబు స్టేట్‍మెంట్ ను పోలీసులు రికార్డ్ చేసుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read