తన రాజకీయ అవసరాలు కోసం, ఎవరి మీద అయిన పుకార్లు పుట్టించటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. తప్పుడు సమాచారం ఇచ్చి, పుకార్లు పుట్టించి, ప్రజలను కన్ఫ్యూజ్ చేసి, లబ్ది పొందటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టైల్. అందుకే జగన్ మోహన్ రెడ్డి పార్టీని, ఫేక్ పార్టీ అని, ఫేక్ ఫెలో అని చంద్రబాబు ఎప్పుడూ సంబోధిస్తూ ఉంటారు. అయినా ఈ ఫేక్ పనులు మాత్రం వైసీపీ నేతలు ఆపటం లేదు. గంజాయి రవణా విషయంలో, దేశ వ్యాప్తంగా ఏపి పై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణా, కేరళ, తమిళనాడు, ఒరిస్సా, ఇలా ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా అది, ఏపి నుంచే వెళ్తుంది. ఈ విషయం ఆయా రాష్ట్రాల పోలీస్ ఆఫీసర్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణా రాష్ట్రంలోని నల్గొండలో భారీగా గంజాయి పట్టుబడింది. యధావిధగా వాటి మూలాలు ఏపిలో ఉన్నాయని నల్గొండ పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. తమ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం, గంజాయి పై ఉక్కు పాదం మోపటానికి నేరుగా రంగంలోకి దిగారు. అసలు వీటి మూలాల పైనే దెబ్బ కొట్టాలని, ఏకంగా విశాఖ వచ్చారు. అక్కడ గంజాయి సాగు చేస్తున్న వారి వద్దకు వెళ్ళారు. అయితే బరి తెగించిన గంజాయి ముఠా, పోలీసుల పైనే దా-డి చేసారు. దీంతో నల్గొండ పోలీసులు ఫైర్ ఓపెన్ చేసారు.

vsreddy nalgonda 28102021 2

అయితే ఈ విషయం ప్రముఖంగా రావటంతో, ఏపి పరువు పోయింది. ముఖ్యంగా ఏపి పోలీస్ ఏమి చేస్తుందనే వాదన మొదలైంది. అంతే కాదు, నారా లోకేష్, అన్ని రాష్ట్రాల పోలీసులు మాట్లడిన వీడియో పోస్ట్ చేసారు. దీని పై తాము ఎక్ష్పొజ్ అవ్వటంతో, విజయసాయి రెడ్డి ఎదురుదా-డి మొదలు పెడుతూ, పరోక్షంగా నల్గొండ ఎస్పీని టార్గెట్ చేస్తూ, ఆయన చంద్రబాబు మినిషి అని, అతను ఇతర రాష్ట్రాల్లో ఉన్న పోలీసులతో మాట్లాడి, ఏపి పరువు తీసే విధంగా చేసారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యల పై నల్గొండ ఎస్పీ రంగనాద్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. టిడిపికి, చంద్రబాబుకు తాను అనుకూలం అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాను చెప్పటంతోనే, కర్ణాటక, తెలంగాణా, మహరాష్ట్ర పోలీసులు ఏపి పేరు చెప్పారని చెప్పటం, హాస్యాస్పదం అని అన్నారు.ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. సరైన సమాచారం లేకుండా ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదని అన్నారు. మరి విజయసాయి రెడ్డి ఏమి అంటారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read