గత కొన్ని రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రజల నుంచి అనేక విమర్శలు ఎదుర్కుంటూనే ఉంది. టిటిడి పరిపాలన శైలి ప్రజలకు అసంతృప్తిని మిగులుస్తుంది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం, అనేక మంది ఎక్కడెక్కడ ఎక్కడ నుంచో వచ్చి, ప్రశాంతత కోసం దర్శనం చేసుకుంటారు. కేవలం ఆ స్వామిని చూసే రెండు మూడు సెకండ్ల కోసం, భక్తులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇంత మంది భక్తులకు అన్నీ సమకూర్చి, విమర్శలు లేకుండా చూడటం, టిటిడికి కత్తి మీద సాము అనే చెప్పాలి. అయితే టిటిడి పై మాత్రం విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఒక పక్క ఇలాంటి ప్రజలు ఎదుర్కునే సమస్యలు ఒక వైపు ఉంటే, రాజకీయంగా కూడా ఈ మధ్య తిరుమల పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా టిటిడిని అపవిత్రం చేస్తున్నారు అంటూ, రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. అనేక అంశాల్లో ప్రతిపక్షాలు, విమర్శలు చేస్తూ వచ్చాయి. అయితే ఎప్పటికప్పుడు టిటిడి వాటికి సమాధానం చెప్తూ దాట వేస్తూ వెళ్ళిపోతుంది. అయినా ఏదోక సమస్య వస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో టిటిడి బోర్డు కాల పరిమితి అయిపోవటం, బోర్డు మళ్ళీ వేసేంత వరకు స్పెషల్ అథారిటీ చేతిలో పెట్టటం, ఇవన్నీ కూడా విమర్శలకు దారి తీసాయి. తాజాగా సినీ నటి నమిత చేసిన వ్యాఖ్యలు మళ్ళీ టిటిడి పరిపాలన పై చర్చకు దారి తెసాయి.

namitha 11072021 2

ప్రముఖ సినీ నటి నమిత, ఈ రోజు ఉదయం తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు. ఆమె, తన భర్తతో కలిసి ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్నారు. మాములుగా అందరు సెలబ్రిటీలు దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడినట్టే ఆమె కూడా మీడియాతో మాట్లాడారు. అయితే అందరిలా ఏదో మాట్లాడాలని మాట్లాడకుండా, ఆమెకు ఆలయంలో ఎదురైనా అనుభవాలు పంచుకున్నారు. భక్తులకు శ్రీవారి దర్శనం విషయంలో లోటు పాట్లు ఉన్నాయని, సంతృప్తికర దర్శనం కల్పించలేక పోతున్నారని అన్నారు.టిటిడిలో ప్రస్తుతం పరిపాలన సరిగ్గా లేదని, గతంలో ఉన్న అధికారులు ఉన్నప్పుడు, పరిపాలన బాగుందని అన్నారు. టిటిడి ఉద్యోగులు అంతా ఏదో భయందోళనలో, భయం భయంగా ఉన్నట్టు కనిపిస్తున్నారని అన్నారు. ఎందుకో కానీ సంతృప్తిగా, ప్రశాంతంగా వాతావరణం లేదని అన్నారు. నిమిత చేసిన ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా టిటిడి ఉలిక్కి పడింది. సహజంగా సినీ నటులు చేసే వ్యాఖ్యలు, ప్రజల్లోకి బలంగా వెళ్తాయి. మరి నమిత చేసిన వ్యాఖ్యల పై, టిటిడి ఏమైనా స్పందిస్తుందో, లేక పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read