2014లో హుజూర్‍నగర్ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లఘించారు అంటూ, ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసారు. ప్రస్తుతం, నాంపల్లి కోర్టులోని, ప్రజా ప్రతినిధుల కోర్టులో ఈ కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. అయితే ఈ కేసు విచారణ గత వారం వచ్చిన సందర్భంలో, జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి అంటూ, కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. జగన్ మోహన్ రెడ్డి మాత్రం కోర్టు విచారణకు హాజరు కాకుండా, నెల్లూరులో గౌతం రెడ్డి సంస్మరణ సభకు వెళ్లారు. దీంతో కోర్టులో ఈ రోజు ఏమి జరుగుతుంది, జగన్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుందా అని అందరూ భావించిన సమయంలో, ఈ కేసులో ట్విస్ట్ నెలకొంది. జగన్ మోహన్ రెడ్డి అడ్వొకేట్ లు కోర్టు ముందు హాజరు అయ్యి, కోర్టుకు చెప్పిన సమాధానంతో ట్విస్ట్ నెలకొంది. తమకు సమన్లు అందలేదని, అందుకే జగన్ మోహన్ రెడ్డి విచారణకు హాజరు కాలేక పోయారని, కోర్టుకు తెలిపారు అయితే దీని పై స్పందించిన కోర్టు, ఈ నెల 30వ తేదీ లోపు సమన్లు జారీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ 31కి వాయిదా పడింది. 31న జగన్ విచారణకు వస్తారో లేదో చూడాలి. లేకపోతే మరే సాకు అయినా చెప్పి, తప్పించుకుంటారో మరి ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read