ప్రముఖ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ – జనసేనాని పవన్‌కల్యాణ్‌ మధ్య జరిగిన భేటీపై సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నది. ఒక సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పవన్‌కల్యాణ్‌ను ఎందుకు కలిశారో అర్ధంకాక రాజకీయ వర్గాలు, జనం, అభిమానులు తలలు పట్టుకున్నారు.అసలు నాదెండ్ల మనోహర్‌, పవన్‌కల్యాణ్‌ను ఎందుకు కలవాల్సి వచ్చింది? అనే సందేహాలు షికార్లు చేస్తున్నాయి. నాదెండ్ల భేటీపై పుకార్లు కూడా దావానంలా వ్యాపించాయి. అసలే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిన నేప ధ్యంలో వీరిద్దరి భేటీ పలు అనుమానాలకు తావిస్తోంది. నాదెండ్ల పార్టీ మారే ప్రస క్తేలేదని, ఆయన కాంగ్రెస్‌కు కొండంత అండగా ఉంటారే కాని ఇటువంటి పరిస్ధితుల్లో పార్టీ వదిలి వెళ్లారని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. పవన్‌కల్యాణ్‌తో నాదెండ్ల కలిసి ఉంటే ఏదైనా వ్యక్తిగతంగా కలిసి ఉండొచ్చని అంటున్నారు.

pk 24062018 2

కాగా వచ్చే సంవత్సరం అసెంబ్లి ఎన్నికలు ఉండడంతో పాటు ప్రస్ధుత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్న నేపధ్యంలో అనేక నూతన సమీకరణలకు తెర లేచింది. రానున్న ఎన్నిక ల్లో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న క్రమంలో వీరిద్దిరి భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందంటున్నారు. అయితే ఇంకో ప్రచారం కూడా చక్కర్లు కొడుతోంది. ఇంకా సంవత్సరం వ్యవధిలో అసెంబ్లి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌తో జనసేన పొత్తు గురించి కూడా చర్చించేందుకే నాదెండ్ల మనోహర్‌ , జనసేనానిని కలిశారనే మరో వాదన వినిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో అవలంభించాల్సిన రాజకీయ అంశాలు, పొత్తులు, పార్టీ అభివృద్ధి గురించి రాహుల్‌గాంధీతో ఇటీవల ఢిల్లిలో చర్చించిన నాదెండ్ల మనోహర్‌ , ఆ అంశాలపై పవన్‌తో చర్చించేందుకే భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది.

pk 24062018 3

రానున్న ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసి పోటీ చేసేందుకు ఉన్న అవకాశాల పై చర్చించేందుకు మనోహర్‌ , పవన్‌తో కలిసి,చర్చించారంటున్నారు. రానున్న ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ , వైసీపీ పార్టీతో కలిసి పని చేసేందుకు అంత ఇష్టంగా లేరన్న సమాచారంతోనే నాదెండ్ల ముందస్తు వ్యూహంతో పవన్‌తో ప్రాథమికంగా కలిశారంటున్నారు. ఈ క్రమంలో తాజాగా గుంటూరు జిల్లా నంబూరులో దశావతార శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్ధానంలో జరిగిన ధ్వజస్తంభం కార్యక్రమంలో కూడా నాదెండ్ల మనోహర్‌, పవన్‌కల్యాణ్‌ ఇద్దరూ కలిసి, మాట్లాడుకున్నారు. ఈ విషయంలో ఏర్పడిన రాజకీయ సందిగ్ధతకు తెర తొలగాలంటే ఆ ఇద్దరు నేతల్లో ఎవరో ఒకరు నోరు తెరిచి, మాట్లాడితే తప్ప వాస్తవాలు బహిర్గతమయ్యే పరిస్దితి లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయినా రాష్ట్రంలో చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీతో పవన్ వెళ్ళే అవకాసం లేదని, ఇప్పటికే ఆయన బీజేపీతో పూర్తి అవగాహనతో పని చేస్తున్న విషయాన్ని, రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read