వైద్యుడు సుధాకర్ విషయంలో హైకోర్టు తీర్పు ఇస్తూ, ఆయన కేసును సిబిఐకి ఇస్తూ, ఈ రోజు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రతిపక్షాలు, ప్రభుత్వ వైఖరి పై మండి పడుతున్నాయి. ఒక హైకోర్ట్, ప్రభుత్వం మీద నమ్మకం లేదు, విషయాలు దాస్తున్నారు అని చెప్పింది అంటే, ప్రభుత్వం ఎలా పని చేస్తుందో అర్ధం అవుతుంది అని అన్నారు. ఈ కేసు విషయంలో, ప్రభుత్వం మొదటి నుంచి వ్యవహరిస్తున్న తీరు పై మండి పడుతున్నారు. ఇక అలాగే ఈ రోజు, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు, ఉపాధి హామీ కూలీలకు సరైన సౌకర్యాలు ఇవ్వటం లేదని కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చెయ్యటం, అలాగే ఇంటలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దు చెయ్యటం ఇవన్నీ రోజు జరిగాయి. దీంతో, ఈ రోజు వైసీపీ పార్టీ కొంచెం డిఫెన్సు లోకి వెళ్ళింది. దీంతో, కోర్టులను చంద్రబాబు మ్యానేజ్ చేస్తున్నారు అనే స్థాయికి వాళ్ళ వ్యాఖ్యలు వెళ్ళాయి. ఈ రోజు వైసీపీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ, తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

ముందుగా డాక్టర్ సుధాకర్ విషయం పై మాట్లాడుతూ, "ఆ డాక్టర్ కంట ఏదో జరిగిపోయింది, సుధాకర్ కి అన్యాయం జరిగిపోయింది, అతన్ని కొట్టారు అంటున్నారు. వాస్తవానికి అక్కడ పోలీసులు ఎంతో ఓర్పుతో, సమాయనంగా వ్యవహరించారు. పోలీసులకు దండం పెట్టాలి. డాక్టర్ సుధాకర్ మాత్రం, ఒక సాడిస్ట్ లాగా, సైకో లాగా బూతులు మాట్లాడి, అలాంటి వ్యక్తీకి వీళ్ళు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సుధాకర్ అనే వ్యక్తీ ఒక సైకో, అది అర్ధం అవుతుంది ఆయన మాటలు వింటుంటే. ఒక ముఖ్యమంత్రి మీద అలా మాట్లాడుతున్నారు అంటే, దీని వెనుక కుట్ర కోణం ఉంది. తప్పులు చేసి, దళిత కార్డు ఉపయోగిస్తే అయిపోదు. దళితులను ఎవరైనా అంటే హక్కులు వస్తాయి కాని, ఆ హక్కులు ఉన్నాయని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. సిబిఐ విచారణ జరిగితే మంచిదే." అని డాక్టర్ సుధాకర్ విషయంలో ఆయన చెప్పారు.

"హైకోర్ట్ లో వచ్చే ముందే చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తా ఉంది అంటే, కచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని విచారించాలి, చంద్రబాబు నాయుడు గారి కాల్ లిస్టు బయట పెట్టాలి. ముందుగా వచ్చే తీర్పులు అన్నీ కూడా ఈయనకు ఎలా తెలుస్తున్నాయో మాకు అర్ధం కాని పరిస్థితి ఉంది. మాకైతే గంటన్నరకో ఎప్పుడో తెలిసింది., ఇలా జరిగింది అని చెప్పి, ఆయన మాత్రం అలెర్ట్ గా ఉండి, పదే పది నిమిషాలలో మీడియా సమావేశం పెట్టించి, అదే విధంగా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతా ఉన్నారు అంటే, ఏ స్థాయిలో మ్యానేజ్ చేస్తూ ఉన్నారో, అర్ధం అవుతుంది. వారికి తెలుసు, ఏమి చేస్తుందో, ఏమి జరుగుతుందో అని" అని చంద్రబాబు విషయంలో అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read