ఎవరూ ఊహించని విధంగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు. అచ్యుతాపురం సమీపంలోని ధారభోగాపురం వద్ద ప్రజాసంకల్పయాత్ర శిబిరం వద్ద వైయస్ జగన్ ని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఇరువురు దాదాపు 15 నిమిషాలు చర్చించుకున్నారు. అయితే సాంబశివరావు వైపు నుంచి ఏ ప్రకటన లేదు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి మాత్రం, వైసీపీలో సాంబశివరావు చేరుతున్నట్లు ప్రకటించారు. సాంబశివరావు చేరికతో వైసీపీకి అదనపు బలం వచ్చిందని చెప్పారు. ప్రకాశం జిల్లాకు చెందిన సాంబశివరావు, సమర్ధవంతమైన అధికారిగా పేరు ఉంది.
చంద్రబాబుకి చాలా నమ్మకమైన ఆఫీసర్ గా పేరు ఉంది. ఆయన కూడా చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్టుగానే, సామర్ధవంతంగా పని చేసారు. రిటైర్డ్ అయినా సరే, ఆయన సేవలు రాష్ట్రానికి అవసరం అని భావించి, ఆయనకు విశాఖపట్నం గంగవరం పోర్టు చీఫ్ సెక్యూరిటి అధికారిగా, చంద్రబాబు నియమించారు. అందుకే ఆయన విశాఖలోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా జగన్ అక్కడ ఉండటంతో, ప్రతిపక్ష నాయకుడ్ని కర్టసీగా కలిసారేమో అని అందరూ అనుకున్నారు. కాని కొంచెం సేపటికే, విజయసాయి రెడ్డి వచ్చి, ఆయన పార్టీలో చేరినట్టు ప్రకటించారు.
అయితే ఈయన చర్యతో అందరూ అవాక్కయారు. ఈయన డీజీపీగా ఉండగా, జగన్ పార్టీ నేతలను ఒక ఆట ఆడుకున్నారు. ఇలాంటి జగన్ పార్టీలో చేరటం, నిజంగానే షాక్ గా ఉందని అంటున్నారు. ఒక తెలుగుదేశం నేత మాట్లాడుతూ "సాంబశివరావు గారి లాంటి వ్యక్తి జగన్ చెంత కు చేరటం ...నిజంగానే షాక్..నిజాయితీ కలిగిన సాంబశివరావు గారు ...టీడీపీ ..చంద్రబాబు పట్ల ఏమి అసంతృప్తి కలిగిందో తెలియదు.. అత్యంత ప్రతిభా పాటవాలు కలిగిన ఆయన వైసీపి లో చేరటం దురదృష్టకరం... వారు ఆర్టీసీ లో కాని...డీజీపీ గా కాని అద్భుతంగా సేవలందించారు.. చంద్రబాబు తో విభేదించి నట్డు ఎక్కడా వార్తలు రాలేదు.. ఏది ఏమైనా ...పక్కలో బళ్ళాలను ఉంచుకున్నారు పాపం చంద్రబాబు...అప్పుడు ఐవైయ్యార్... ఇప్పుడు సాంబశివరావు గారు...ఇంకా ఎన్ని పాములొస్తాయో" అని అన్నారు.