నంద్యాల ఎన్నికల్లో రికార్డు బద్దలు అయ్యింది. ఎప్పుడూ 72% కూడా దాటని పోలింగ్, ఈ సారి రికార్డు బద్దలు కొట్టి, దాదాపు 85% పోలింగ్ నమోదు అయ్యింది. అత్యధిక శాతం, మహిళా వోటర్లు క్యూ కట్టారు. ఇంత భారీగా పోలింగ్ నమోదు కావటం అంటే, మామూలు విషయం కాదు. భుమా కుటుంబం మీద సానుభూతి, ఆ పిల్లలు కష్టపడిన తీరు, అన్నిటికీ మించి కళ్ళ ముందు అభివృద్ధి చెందుతున్న నంద్యాల... ఇవన్నీ ఒక ఎత్తు అయితే, 15 రోజులు పాటు, జగన్ మాటలు, వ్యవహార శైలి అన్నీ ఈ వోటింగ్ పెరగటానికి దోహదపడ్డాయి.
మరి నంద్యాలలో ఎవరి బలమెంత..?
మొదటి నుంచి అనుకున్నట్టే, నంద్యాల టౌన్, తెలుగుదేశం పార్టీకి వన్ సైడ్ స్వీప్ అయిపొయింది. సైకిల్ స్పీడ్ ముందు, జగన్ పార్టీ ఊసే లేదు. ఇక నంద్యాల రూరల్, గోస్పాడులో ఒక మాదిరి పోటీ జరిగినా, ఇక్కడ కూడా తెలుగుదేశానికి స్పష్టమైన మెజారిటీ కనిపిస్తుంది. ఓవరాల్ గా, ౩౦ వేల పై చిలుకు మెజారిటీ స్పష్టం అంటున్నారు.
నంద్యాల ఫలితాన్ని తేల్చే వర్గమైన మైనార్టీల్లో ఓట్ల శాతాన్ని బట్టీ చూస్తే టీడీపీ అగ్రస్థానంలో ఉంది. మైనార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సపోర్ట్ సైకిల్ కే అనేశారు.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, జగన్ పార్టీకి బాగా దెబ్బ వేసింది అంటున్నారు. భారీగా జగన్ పార్టీకి పడాల్సిన వోట్లు, కాంగ్రెస్ పార్టీ చీల్చటంతో, తెలుగుదేశం పార్టీకి మరింత బలం పెరిగింది.
ఇక కచ్చితమైన సమాచారం కోసం, 28 వరకు ఆగాల్సిందే...