కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీఆర్ భవన్ లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడిన మాటలు మీ కోసం... "అక్రమాల తోటి, దౌర్జన్యాలతోటి నామినేషన్ పత్రాలు చించేసి గెలిచారు. అభ్యర్థులను ఇబ్బందులు పెట్టారు. మద్యం బాటిళ్లతో మభ్య పెట్టారు. బలవంతంగా విత్ డ్రాలు చేశారు. చరిత్ర హీనులయ్యారు. ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గు గా లేదా? ఎలాంటి దౌర్జన్యాలు చేశారో సర్వే చేస్తే అర్థమవుతోంది. 341 చోట్ల ప్రలోభాలు పెట్టారు. అభ్యర్థులు, ఓటర్లను వారి పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తామని బెదిరించారు. వారికి ఆడపిల్ల ఉంది, స్కూలుకు వెళ్తుంటుంది గుర్తు పెట్టుకో అని బెదిరించారు. 71 చోట్ల కిడ్నాప్ లకు పాల్పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై దా-డు-లు, దౌర్జన్యాలు చేశారు. 1,085 చోట్ల బెదిరింపులకు పాల్పడ్డారు. స్క్రూట్నీలో 237 చోట్ల అక్రమంగా టీడీపీ నామినేషన్లను తొలగించారు. 426 చోట్ల నామినేషన్ పత్రాలను లాక్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు మొత్తం 9,696 ఎంపీటీసీ స్థానాల్లో ఏం ఘనకార్యాలు చేశారని మీకు ఏకగ్రీవాలొస్తాయి. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలి. పరిషత్ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలతో.. ఏదో సాధించేసినట్లు వీర్రవీగుతున్నారు. చరిత్ర హీనులైవుండి మాది పెద్ద చరిత్ర అనుకుంటున్నారు. అక్రమ దారుల్లో గెలిచి దాన్ని గెలుపనుకోవడం సిగ్గు గా లేదా? పరిషత్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఒక ఫలితాలేనా? బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారు. అక్రమ దారులోల గెలవడాన్ని జనం ఛీ అంటున్నారని గ్రహించి ఈ విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం కొడాలి నాని లాంటి శునకం చేత భౌ భౌ మనిపించారు.
కొడాలి నాని అనే బూతుల శునకం. కొడాలి నాని భాష చూస్తుంటే జుగుప్సాకరంగా ఉంది. బంగారు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెడితే ఎలా ఉంటుందో కొడాలి నానీకి అధికారం ఇవ్వడంతో అలా ఉంది. వరాహంబు అంటే పంది అని కూడా కొడాలినానీకి తెలిసిరాదు. పౌర సరఫరాల మంత్రి పదవి ఆయనకు ఇలా ఇచ్చారో అర్థంకావడంలేదు. ఒయన ఒక వరాహం లాంటివాడు. కొడాలి నానీ నోరు అపరిశుభ్రతకు మారుపేరు. ఎన్నికల కమిషన్ ని గౌరవించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ అగౌరవపరిచారు. తప్పుడు పద్ధతిలో పరిషత్ ఎన్నికల్లో గెలిచారు. రాజ్యాంగంను గౌరవిస్తూ.. ఎన్నికల కమిషన్ రమేష కుమార్ ని గౌరవించకుండా ముప్పుతిప్పులు పెట్టి మూడు చెరువుల నీరు తాగించారు. ఆయనకు కులాన్ని అంటగట్టారు. పరిషత్ ఎన్నికల్లో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన విషయం అందరికీ తెలుసు. కొడాలి నానీ లాంటి దుర్మార్గులను జనం మరచిపోరు. గతంలో ఎన్నికలంటే పవిత్రమైనవిగా భావించేవారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. పవిత్రంగా కనాల్సిన పిల్లల్ని అపవిత్రంగా కన్నారు. పతివ్రత లాంటి ఎన్నికలను పక్కన పెట్టి అపవిత్రంగా గెలిచి సంబర పడుతుంటే సిగ్గేయడంలేదా? చింద్రబాబునాయుడు పై పిచ్చి ప్రేలాపనలు పేలిస్తే తాట, తోలు రెండూ వలుస్తామని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు హెచ్చరించారు.