క-రో-నా మహమ్మారి మానవత్వాన్ని తుంచేస్తోంది. మనుషులను కఠిన పాషాణులుగా మార్చేస్తోంది. కొన్ని చోట్ల ఏ కారణంగా మృతి చెందిన ఆయనకు క-రో-నా ఉందేమోనన్న భయంతో దగ్గరకు వెళ్లేందుక కూడా వెనుకంజ వేస్తున్నారు. మరి కొన్ని చోట్ల క-రో-నా బారిన పడి మృతి చెందిన వారినికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుకుంటున్నారు. ఇక ఏకంగా కొన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా ఇలాంటి సంఘటనలు రోజూ కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. కానీ ఎటువంటి మార్పు రాలేదని జరుగుతున్న ఘటనలు రుజువుచేస్తున్నాయి. తాజాగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇటువంటి అమానవీయ సంఘటనలే చోటుచేసుకున్నాయి. రోజంతా అంబులెన్లోనే.. క-రో-నా అనుమానిత లక్షణాలతో శ్రీకాకుళం జిల్లాభామిని మండలం బత్తిలి గ్రామానికి చెందిన 39 ఏళ్ల వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. అంత్యక్రియలకు గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆంబులెలోనే మృతదేహాన్ని ఉంచి రోజంతా తిప్పాల్సి వచ్చింది. మధ్యాహ్నం నుండి రాత్రి వరకూ గ్రామంలోని నాలుగు శ్మశానవాటికలకు తీసుకెళ్లినా ప్రజలు అడ్డుకున్నారు.

ఇక ప్రభుత్వ హాస్పిటల్ విషయాలు కూడా అంతే. గంటలు గంటలు వేచి చూసి, ప్రాణాలు వదిలే పరిస్థతి. నిన్న అంతపురం సంఘటన మర్చిపోక ముందే. ఇప్పుడు మరో సంఘటన గుంటూరులో జరిగింది. గుంటూరులో పాజిటివ్ వచ్చిన కొంత మందిని అంబులెన్స్ లో తీసుకోవచ్చారు. అయితే బెడ్లు ఖాళీగా లేకపోవటంతో, అవాస్త పడుతున్న ఒక యువకుడి దగ్గరకు వచ్చి, నీతో పాటు వచ్చిన ఒక ముసులోడు గంటలో పోతాడు, అప్పుడు బెడ్ నీకే అని అంబులెన్స్ డ్రైవర్ చెప్పే పరిస్థతి వచ్చింది అంటే, పరిస్థతి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఏకంగా విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని, ఇలాంటి ఘటన గురించి చెప్పి, సంచలనానికి తెర లేపారు. విజయవాడకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే సోదరుడు, క-రో-నా బారిన పడి నిన్న రాత్రి అంతా బెడ్డు దొరక్క, అంబులెన్స్ లోనే ఉండి, చికిత్స అందక, ఉదయం చనిపోయారని ట్వీట్ చేసారు. ఒక మాజీ ఎమ్మెల్యే కుటుంబంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఇక రాష్ట్రంలో సామాన్య పరిస్థతి ఏమిటి అంటూ, కేశినేని నాని ట్వీట్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read