అమరావతి రైతులు రోడ్డన పడటంతో, నూతన సంవత్సర వేడుకలను రద్దు చేసుకున్న చంద్రబాబు, ఈ రోజు అమరావతి ప్రాంత రైతుల మధ్యే గడపనున్నారు. ఈ రోజు చంద్రబాబు, ఆయన సతీమణి, నారా భువనేశ్వరితో కలిసి, రాజధాని రైతులతో కలిసి, ఆందోళన కార్యక్రమంలో పాల్గున్నారు. ఎప్పుడూ లేనిది, ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలు కూడా వచ్చి ఆందోళన చెయ్యటంతో, చంద్రబాబు కూడా, ఎప్పుడూ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గునని, తన సతీమణిని కూడా తీసుకువచ్చి, రైతుల తరుపున అండగా నిలిచారు. ముందుగా కనకదర్గమ్మ ఆశీస్సులు తీసుకున్న చంద్రబాబు, ఎర్రబాలెం రైతు దీక్షకు చంద్రబాబు హాజరయ్యారు. అమరావతిలో రైతులతో పాటు చంద్రబాబు గారు, భవనేశ్వరి గారు, నందమూరి రామకృష్ణ గారు, నిమ్మల రామానాయుడు గారు, కేశినేని నాని గారు, అనురాధ గారు, గల్లా అరుణ గారు, వర్ల రామయ్య గారు, గంజి చిరంజీవి గారు, శ్రవణ్ కుమార్ గారు.. స్థానిక నాయకులతో కలిసి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంలో, రైతుల దుస్థితి చూడలేకపోతున్నానని కంటతడి పెట్టుకున్న రామకృష్ణ.

amareavati 01012019 2

ఈ సందర్భంగా, భువనేశ్వరి రైతులని ఉద్దేశించి మాట్లాడారు. "అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వొమ్ము చేయరు. భోజనం చేసినా, పడుకున్నా అమరావతి, పోలవరం అనే తపించారు. ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ప్రజల కోసమే కష్టపడ్డారు. రైతులకు పూర్తి మద్దతుగా మా కుటుంబం అండ ఉంటుంది. నాతోటి మహిళల బాధలు నేను అర్ధం చేసుకోగలను. ఆరోగ్యం గురించి మేము ఆందోళన చెందినా....చంద్రబాబు రాష్ట్రం గురించే ఆలోచన చేసేవారం. ప్రజల తరువాతనే నన్ను, కుటుంబాన్ని పట్టించుకునే వారు. అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వొమ్ము చేయరు. భోజనం చేసినా, పడుకున్నా అమరావతి, పోలవరం అనే తపించారు. ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ప్రజల కోసమే కష్టపడ్డారు. రైతులకు పూర్తి మద్దతుగా మా కుటుంబం అండ ఉంటుంది." అని భువనేశ్వరి అన్నారు.

amareavati 01012019 3

ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడుతూ, ఆవేదన వ్యక్తం చేసారు. "రాజధాని తరలి పోతే మాకు‌ చావే శరణ్యం. కారుణ్య మరణాలకు మాకు అనుమతి ఇవ్వాలి. పదిహేను రోజులుగా కంటి మీద కునుకు లేదు. రాజధాని అమరావతి అంటే ఐదు కోట్ల ఆంధ్రులది. రాష్ట్రం కోసమే నాడు మేము మా భూములు ఇచ్చాం. నూతన సంవత్సరం రోజు కన్నీటితో రోడ్ల పై కూర్చున్నాం. 1300పులివెందులకు కేటాయించిన‌ జగన్.. అమరావతి లో నిర్మాణాలు వదిలేశారు. ఒక సామాజిక వర్గం అని చెబుతున్న జగన్... వారు నీకు ఏవిధంగా అన్యాయం చేశారు. అన్ని కులాలు, మతాల వారు రాజధాని గ్రామాల లో ఉన్నారు. నేడు మా మధ్య కూడా చిచ్చు పెట్టావు. ఎవడు ఇక్కడ పెయిడ్ ఆర్టిస్ట్ లు.. మీరు నిరూపిస్తారా. బొత్స స్మశానం అంటారు..‌ స్పీకర్ ఎడారి అంటారు. మీరు ఎక్కడ కూర్చుని పాలన చేస్తున్నారు. చంద్రబాబు తో గొడవ ఉంటే ఆయనతో తేల్చుకోండి. మా రాజధానిని మాత్రం ఇక్కడ నుంచి తరలించ వద్దు. జగన్ పోలీసుల అండతో సచివాలయం కు వస్తున్నారు. మేము మా పుట్టింటికి రావాలన్నా ముళ్ల‌ కంచెలు వేస్తున్నారు. మూడు జిల్లాల రాజధానుల పేరు చెప్పి.. మూడు ప్రాంతాలలో ప్రజల మధ్య గొడవలు పెడుతున్నారు. అయ్యా జగన్...‌నిన్ను రాజధాని కావాలని విశాఖ ప్రజలు అడిగారా. అమ్మా విజయ లక్ష్మమ్మా... మా అబ్బాయి కి ఒక్క ఛాన్స్ అన్నావు. ఇప్పుడు నీ కొడుక్కి ఎందుకు‌ చెప్పడం లేదు. మా ఆడ వాళ్ల ను రోడ్డెక్కించి ఏడిపిస్తున్నాడు." అంటూ రైతులు వాపోయారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read