Sidebar

15
Sat, Mar

నారా హమారా సభ వేదికగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావం పూరించబోతోంది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో టీడీపీకి దూరమైన ముస్లిం మైనార్టీలకు తిరిగి దగ్గరయ్యేందుకు గుంటూరు సభను వేదికగా చేసు కోబోతోంది. ఈ సభ ద్వారా అటు బీజేపీని ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ లను టార్గెట్ చేసేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గుజరాత్ అల్లర్లను గుర్తు చేస్తూ బీజేపీతో పాటు ఆ పార్టీతో స్నేహంగా మెలిగే పార్టీను కూడా మైనార్టీల ఎదుట దోషిగా నిలబెట్టేలా వ్యవహరించ బోతోంది. గుంటూరులో జరగనున్న నారా హమారా' టిడిపి సభ సాక్షిగా బీజేపీ పై ప్రత్యక్ష సమరానికి సన్నద్ధమవుతున్న చంద్రబాబు పనిలో పనిగా వైసీపీకి కూడా మైనార్టీలు దూరమయ్యేలా ఉభయ తారకంగా వ్యవహరించబోతున్నారు. ఈ వేదిక నుండే రాష్ట్ర మంత్రివర్గంలో మైనార్టీలకు స్థానం కల్పించే అంశం పై కూడా కీలక ప్రకటన చేయనున్నారు.

minority 28082018 1

రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల ఓటింగ్ విధానాలను ఎండగట్టాలని భావిస్తోంది. దీని ద్వారా బీజేపీని మైనార్టీల ఎదుట దోషిగా నిలబెట్టడడంతో పాటు వైఎస్ జగన్ కూడా బీజేపీ తానులో ముక్కేనన్న భావన మైనార్టీలలో వచ్చేలా వ్యూహాత్మకంగా వ్యవహరించబోతోంది. ఈ సభ ద్వారా ఇటు ఏపీలోను, అటు తెలంగాణాలోనూ ముస్లిం మైనార్టీల కు టీడీపీ ప్రత్యామ్నాయం అయ్యేలా వ్యవహరించబోతోంది. పనిలో పనిగా ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ అంశంలో కూడా చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇన్నాళ్లు మంత్రివర్గ విస్తరణకు రాజకీయ కారణంతో పాటు వరదలు, ఆషాఢం అడ్డుపడ గా మంత్రివర్గ విస్తరణకు ఇదే అదును గా భావిస్తున్న చంద్రబాబు ఈ సభా వేదిక నుండే మైనార్టీలకు మంత్రి పదవి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

minority 28082018 2

ప్రకటనకే పరిమితం కాకుండా శ్రావణమాసం కావడంతో ఈ నెలాఖరులోగానే మంత్రి వర్గంలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులలో ఒక దానిని ముస్లిం మైనార్టీలకు కేటాయించనున్నారు. మంత్రివర్గ విస్తరణ కోసం షరీఫ్, జలీల్ ఖాన్, చాంద్ షాల పేర్లను పరిశీలిస్తున్న చంద్రబాబునాయుడు, ఎమ్మెల్సీ షరీఫ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటివరకు ముస్లిం మైనార్టీల కోసం ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రస్తుతం తాము చేపడుతున్న పథకాలను కూడా ఏకరవు పెట్టడడం ద్వారా వారి మనసులను గెలుచుకునే పనిలో పడినట్లు కనిపిస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ లో మైనార్టీలకు కేవలం రూ.457 కోట్లు మాత్రమే కేటాయించగా, నూతన రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్లలో రూ. 3వేల కోట్లు కేటాయించిన అంశాన్ని చంద్రబాబు గుర్తు చేయడంతో పాటు మైనార్టీలపై ఈ సభ వేదికగా వరాల జల్లు కురిపించేలా టీడీపీ సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

minority 28082018 3

పది శాతం వరకూ ఉండగా, గత ఎన్నికల్లో ఎనిమిది శాతం వరకూ వైఎస్సార్ కాంగ్రెస్కే పోలైనట్లు టీడీపీ భావిస్తోంది. బీజేపీతో పొత్తుతో జరిగిన నష్టాన్ని తిరిగి పూడ్చుకునేలా సభను సద్వినియోగం చేసుకోనుంది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో కాస్త కలిసొచ్చినట్లు భావిస్తు న్న చంద్రబాబు ఆ పార్టీకి దూరం కావడం ద్వారా అక్కడ జరిగే నష్టాన్ని అదే బీజేపీని టార్గెట్ చేయడం ద్వారా పొందాలని యోచిస్తున్నారు. మరో వైపు గత ఎన్నికల్లో అధిక శాతం మైనార్టీల ఓట్లు వైసీపీకి పడగా, బీజేపీ, వైసీపీల స్నేహాన్ని మైనార్టీలకు వివరించడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్లలా ఈ సభ ద్వారా మోడీ హయాంలో ముస్లిం మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాల పై చర్చించడంతో పాటు, ఆ పార్టీతో స్నేహంగా ఉండే పార్టీలు కూడా మైనార్టీలకు దూరం -అయ్యేలా ఈ సభను వేదికగా చేసుకునే యోచనతో ఉన్నట్లు కనబడుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read