ఈ రోజు మూడు మూడు రోజుల పాటు, తెలుగుదేశం పార్టీ రైతు కోసం కార్యక్రమం నిర్వహిస్తుంది. వరుస విపట్టులతో రైతులకు ఎదురైన ఇబ్బందులు, అలాగే ప్రభుత్వ వైఖరితో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా తెలుగుదేశం పార్టీ మూడు రోజుల కార్యాచరణకు పిలుపు ఇచ్చింది. ఇందులో భాగంగా 175 నియోజవర్గాల్లో తెలుగుదేశం నేతలు, ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇక అవినగడ్డ నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులను, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గునటం కోసం నారా లోకేష్ ఈ రోజు ఉదయం అవనిగడ్డ బయలుదేరి వెళ్ళారు. అయితే అవనిగడ్డ వెళ్తున్న సమయంలో, నారా లోకేష్ కాన్వాయ్ నిమ్మకూరు రాగానే, సడన్ గా రహదారి పై ఆగింది. నిమ్మకూరులో రహదారి పై వెళ్తున్న రైతులను చూసి, కాన్వాయ్ ఆపి, వారి వద్దకు వెళ్లారు నారా లోకేష్. ఈ సందర్భంగా, ధాన్యంతో వెళ్తున్న ట్రాక్టర్ కూడా ఆగింది. అక్కడ రైతులతో మాట్లాడారు నారా లోకేష్. అయితే ప్రభుత్వం చెప్పినట్టుగా ధాన్యం కొనటం లేదని, రైతులు లోకేష్ కు తెలిపారు. తుఫానులో దెబ్బ తిన్న ప్రతి గింజ కొంటాం అని ప్రభుత్వం చెప్పింది కానీ, రంగు మారిన ధాన్యం కానీ, తడిచిన ధాన్యం కానీ ప్రభుత్వం కొనటం లేదని లోకేష్ దృష్టికి తెచ్చారు రైతులు.

lokesh 28122020 2

అలాగే సరైన మద్దతు ధర లేక, నిండా మునిగిపోయాం అని అన్నారు. ప్రభుత్వం గొప్పగా ప్రకటనలు ఇస్తుంది కానీ, వాస్తవంలో ఆ పరిస్థితి లేదని తెలిపారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయక పోవటంతో, తాము దళారుల వద్దే తక్కువ రేటుకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుందని లోకేష్ కు తెలిపారు రైతులు. ఇక ఇక్కడ నుంచి లోకేష్ బయలుదేరి, అవనిగడ్డ చేరుకున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం కొత్త మాజేరు గ్రామం నుంచి రైతు కోసం యాత్ర ప్రారంభించారు. మాజేరు లో ఉన్న పంట పొలాలను లోకేష్ పరిశీలించారు. అదే ప్రాంతంలో తుఫాను వల్ల పంట నష్టపోవటం, ప్రభుత్వం ఆదుకోక పోవటంతో, నష్టపోయిన పంట పొలంలో ఉండగానే, అక్కడ రైతు పొలం మొత్తాన్ని దున్నేసిన సంఘటన ఇక్కడ జరిగింది. ఆ రైతుని లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ప్రభుత్వం చెప్తున్న దానికి, జరుగుతున్న దానికి సంబంధం ఉండటం లేదని అన్నారు. కౌలు రైతులకు ఎటువంటి సహాయం అందడం లేదని, భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, భీమా అందడం లేదని, రంగు మారిన బియ్యం కొనుగోలు చెయ్యడం లేదు అంటూ, లోకేష్ ముందు తమ ఆవేదన చెప్పుకున్నారు రైతులు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read