ఒరేయ్ అంటూ జ‌గ‌న్ ని సంభోదించిన నారా లోకేష్‌ని కొన్ని మేక‌వ‌న్నెపులులు విమ‌ర్శిస్తున్నాయి. ఒక యువ‌కుడు త‌న త‌ల్లిని గేలి చేసిన వారితో పోరాడుతున్నాడు. త‌న తండ్రిపై దాడిచేసిన వారిని ఎదుర్కొంటున్నాడు. త‌న పార్టీలో వేలాది మందిని టార్గెట్ చేసుకుని బ‌రితెగించి మ‌రీ హింసిస్తోన్న పార్టీతో త‌ల‌ప‌డుతున్నాడు. ఈ పోరాటంలో నారా లోకేష్ ని ఎంత‌గా గాయ‌ప‌రిచారో, ఎంత‌గా న‌ష్ట‌ప‌రిచారో తెలుగురాష్ట్రాల‌లో అంద‌రికీ తెలుసు. వైసీపీ పేటీఎం బ్యాచుతోపాటు ముఖ్య‌మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీలు లోకేష్‌కి ఎన్ని పేర్లు పెట్టారో సోష‌ల్మీడియానే సాక్షి. ఎంత‌గా దుర్భాష‌లాడారో మీడియా క‌ళ్ల‌కు క‌ట్టింది. అన్నీ భ‌రించాడు. చివ‌రికి తాను శాంతియుతంగా చేప‌ట్టిన పాద‌యాత్ర‌ని అడుగ‌డుగునా అడ్డుకుంటున్నా స‌హించాడు. నిర్బంధం తీవ్రం అయి నివురుగ‌ప్పిన నిప్పు ఆగ్ర‌హ‌జ్వాలై ఎగిసింది. ఆ ధ‌ర్మాగ్ర‌హం నుంచి వ‌చ్చిందే ఒరేయ్ అనే పిలుపు. ఈ పిలుపుని త‌ప్పుప‌డుతున్న వారంతా చంద్ర‌బాబుని ముస‌లాడు అని జ‌గ‌న్ హేళ‌న చేసిన‌ప్పుడు ఏమ‌య్యారు? ఎన్టీఆర్ కుమార్తె భువ‌నేశ్వ‌రిని అసెంబ్లీలో దూషించిన‌ప్పుడు ఎందుకు ఈ కుహ‌నా మేధావులు ప్ర‌శ్నించ‌లేదు అంటూ టిడిపి కేడ‌ర్ మండిప‌డుతోంది.  యువ‌గ‌ళం పాద‌యాత్రలో నారా లోకేష్ రూటు మార్చారు. ఇప్ప‌టివ‌ర‌కూ పోలీసుల్ని బ‌తిమాలుతూ, రాజ్యాంగాన్ని చూపిస్తూ..త‌న హ‌క్కుల్ని హ‌రించొద్దంటూ శాంతియుతంగా పోలీసులతో సంభాష‌ణ‌లు కొన‌సాగించారు. ప్ర‌సంగాల‌లో కూడా ఎక్క‌డా ఎవ్వ‌రినీ దూషించ‌కుండా లెక్క‌లు, త‌ప్పులు ఎత్తిచూపుతూ మాట్లాడుకుంటూ వ‌స్తున్నారు.  జిడి నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం కత్తెరపల్లి జంక్షన్ లో యువనేత పాదయాత్ర 200 కిలోమీటర్లు చేరుకుంది. బ‌హిరంగ స‌భ లేద‌ని చెప్పినా పోలీసులు విన‌రు. మైకులు లాగేశారు. నిల‌బ‌డ్డ స్టూలు ఎత్తుకుపోయారు. త‌న‌ను ఏ న‌డిరోడ్డుపై నిలిపారో, వారంద‌రినీ అదే రోడ్డుపై నిల‌బెడ‌తాన‌న్నాడు. 40 ఏళ్ల‌కి పైగా హుందాగా క్లీన్ పాలిటిక్స్ చేసిన చంద్ర‌బాబుని ప‌ట్టుకుని వాడు, వీడు, ముస‌లాడు అంటోన్న జ‌గ‌న్ రెడ్డిని ఒరేయ్ అని పిలిచిన‌ నారా లోకేష్‌ని శెహ‌భాష్ నాయ‌కా అంటూ టిడిపి కేడ‌ర్ ప్ర‌శంసిస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read