వైసీపీ ఇటీవల కాలంలో స్కెచ్ వేసిన ప్రతీది బొక్కబోర్లా పడుతోంది. తాజాగా వంగవీటి రాధా విషయంలో మైండ్ గేమ్ ఆడేందుకు ఐప్యాక్-వైసీపీ ఫేక్ అక్కౌంట్లతో చేసిన ప్రచారం ప్లాన్ బెడిసికొట్టేసింది. జనసేనలో వంగవీటి రాధా చేరిపోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వైసీపీకి బ్రేకింగ్ న్యూస్ వదిలింది టిడిపి. నారా లోకేశ్‌తో వంగవీటి రాధ భేటీకి రంగం సిద్ధమైందని వార్తలు రెండు రోజుల ముందు వచ్చాయి. అనుకున్నట్టే పీలేరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర విడిది ప్రాంతంలో ఇరువురు నేతల సమావేశంఅయ్యారు. భేటీ అనంతరం నారా లోకేశ్‌తో కలిసి రాధ పాదయాత్రలో పాల్గున్నారు. వైసీపీ కాపు నేతలే లక్ష్యంగా చేసుకుని వంగవీటి రాధాని టార్గెట్ చేశారు. వైసీపీ ఫేక్ ఖాతాల నుంచి వంగవీటి రాధా పార్టీ మారుతున్నారనే సమాచారాన్ని స్ప్రెడ్ చేశారు. జనసేన పేర్లతో వైసీపీ చాలా రోజులుగా ఈ ఫేక్ ఖాతాలు నడుపుతోంది. ఈ ఖాతాల నుంచి జనసేన గ్రూపుల్లోకి వైసీపీ పోస్టులను పుష్ చేసింది. ఈ ప్రచారం తీవ్రం కావడంతో వంగవీటి రాధా యువసేన స్పందించింది. రాధాపై కొందరు కావాలనే దుష్ప్రచారాలు చేస్తున్నారని, రాధా ప్రతిష్టను మసకబార్చాలని కొందరు కుయుక్తులు పన్నుతున్నారని, ఈ ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దు అని ప్రకటన విడుదల చేశారు. రాధా టిడిపిలోనే కొనసాగుతారని పదేపదే చెప్పాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. పదవుల కోసమో, ఇతర అవసరాల కోసం పార్టీలు మార్చే నైజం రాధాది కాదని తేల్చి చెప్పారు. కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులతో రాధా ప్రతిష్టను మంట కలపాలని చూసే వారి ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవని ప్రకటనలో పేర్కొన్నారు. ఇటువంటి అపోహలు, అనుమానాలు సృష్టించేవారికి చెంపపెట్టులాగ నారా లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా పాల్గుని, అందరి నోర్లు మూయించారు.
వంగవీటి రాధాపై మైండ్ గేమ్ ప్లే చేసి బొక్కబోర్లాపడ్డ వైసీపీ
Advertisements