ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయి ఏంటో మరో సారి రుజువైంది... ఆయనకి ప్రముఖులు ఇచ్చే గౌరవం ఏంటో నిన్న మరోసారి అందరూ చూసారు... చంద్రబాబుకి ఉన్న గౌరవం అది... దేశ విదేశాల్లో ఆయనకు ఎంత గౌరవం లభిస్తుందో మనం వివిధ సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం... తాజాగా, నిన్న హైదరబాద్ లో రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్, భారత రాష్ట్రపతి కోసం ఏర్పాటుచేసిన విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు, అలాగే ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంలో ఒక ఆశక్తికర సంఘటన చోటు చేసుకుంది... రాష్ట్రపతి కోవింద్ దగ్గరకు చంద్రబాబు వచ్చారు... ఆ సందర్బంగా కోవింద్ పక్కన కూర్చోవల్సిందిగా గవర్నర్ కోరగా, ప్రోటోకాల్ ప్రకారం మీరే కూర్చోవాలి అని గవర్నర్ తో అన్నారు... గవర్నర్ మాత్రం చంద్రబాబుని బలవంతంగా రాష్ట్రపతి పక్కన కుర్చోవాల్సిందిగా చంద్రబాబుని బలవంతంగా లాగారు... చంద్రబాబు అక్కడ ఉన్న తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ను అక్కడ కుర్చోవల్సిందిగా కోరగా, గవర్నర్, కెసిఆర్ ఇద్దరూ కలిసి చంద్రబాబుని రాష్ట్రపతి పక్కన కూర్చోబెట్టారు... ఈ విధంగా చంద్రబాబుకి తగిన గౌవరం ఇచ్చారు...
శీతాకాలం విడిది నేపథ్యంలో భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రపతి నిలయంలో ఆయన మూడు రోజులపాటు విడిది చేస్తారు. డిసెంబర్ 27వ తేదీన కోవింద్ అమరావతి రానున్నారు. అమరావతిలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ రాష్ట్రపతి ప్రారంభించనున్నారు... రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సచివాలయం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్రపతి కొత్తగా ప్రారంభించిన రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ లో, గంట పాటు ఉండి, పరిపాలన మొత్తం పర్యవేక్షించనున్నారు... ప్రజలతో కూడా అక్కడ నుంచి టెలి కాన్ఫరెన్స్ చేసే అవకాసం ఉంది.