ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలంగాణా పక్షాపాతిగా వ్యవహరిస్తారు అనే పేరు ఉంది... అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరూ అధికారికంగా ఈ విషయం మీడియా ముందు చెప్పలేదు... మొదటి సారిగా గవర్నర్ నరసింహన్ పై ఆంధ్రప్రదేశ్ నుంచి ధిక్కార స్వరం వినిపించింది... తెలంగాణా ప్రభుత్వానికి పక్షపాతిగా ఉంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా అన్యాయం చేస్తున్నారో, సాక్షాత్తు ఒక ఎమ్మల్యే మీడియా ముఖంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పై షాకింగ్ కామెంట్స్ చేసారు...
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గవర్నర్ నరసింహన్ పై ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గవర్నర్ నరసింహన్ హైదరాబాద్‌లో ఉన్నందున తెలంగాణ పట్ల ప్రేమ చూపుతూ ఆంధ్రప్రదేశ్ పట్ల గవర్నర్ చిన్న చూపు చూస్తున్నారని ఆయన అన్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే చట్ట సవరణ బిల్లును నెలరోజులుగా గవర్నర్ ఆమోదించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఇదే తరహా బిల్లును మూడు రోజుల్లో గవర్నర్ ఆమోదించారని ఆయన అన్నారు. గవర్నర్ తీరు మారకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని విష్ణుకుమార్ రాజు అన్నారు.
నాలా చట్టం లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ కి పరిశ్రమలు రావడం లేదని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో నాలా పన్ను 9 నుంచి 3 శాతానికి తగ్గాలని, ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు రావాలంటే నాలా చట్టం కీలకమని, గవర్నర్ వెంటనే బిల్లును ఆమోదించాలని ఆయన అన్నారు. అయినా ఒకే రకమైన బిల్ ఉన్నప్పుడు తెలంగాణాకు మూడు రోజుల్లో ఆమోదించి, ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటి వరకు అదే రకమైన బిల్ ఎందుకు ఆమోదించలేదో ప్రజలకి చెప్పాలి అని డిమాండ్ చేసారు... మరి ఈ విషయం పై గవర్నర్ కార్యాలయం ఎలా స్పందిస్తుందో చూడాలి... కేంద్ర హోం శాఖ కూడా ఈ విషయం పై ఆరా తీసినట్టు సమాచారం...