ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో మ‌రో అరుదైన సంఘ‌ట‌న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారా వారి పల్లెలో చోటు చేసుకోబోతుందా ? ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ చూడని సంఘటనలు చూడబోతున్నారు ? అదేంటో తెలుసుకునే మందు టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల రాజ‌కీయ వైఖ‌రి గురించి మరో సారి గుర్తు చేసుకోవాలి... పాదయాత్రలో జగన్, చంద్రబాబు పై ఎలా విమర్శలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం... చివరకి చంద్రబాబుని ఉరి తియ్యాలి అని జగన్ మాటలు విన్నాం... ఇటీవల కొంచెం మాటల యుద్ధం తగ్గినట్టే వాతావరణం ఉంది...

nara 11012018 2

ఇటీవ‌ల వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పుట్టిన రోజు వేడుక నాడు చంద్ర‌బాబు నాయుడు పెట్టిన ట్వీట్ తో పాటు దానికి జ‌గ‌న్ స్పందించారు కూడా... అప్పటి నుంచి, కొంచెం వ్యక్తిగత విమర్శలు మాని, అర్ధవంతమైన విమర్శలు చేస్తూ వస్తున్నాడు జగన్... చంద్రబాబు అయితే, ఎప్పుడూ లైన్ దాటరు... ఇక ఎన్నికల వేడి కూడా మొదలైంది... అయితే ఇప్పుడు జగన్ చిత్తూరు జిల్లాలో పాదయత్ర చేస్తున్నారు... భోగి పండుగ రోజు జగన్ పాదయత్ర చంద్రగిరి ప్రాంతంలోనే, చంద్రబాబు ఊరికి కాస్త దూరంలో జరగనుంది... జగన్ అక్కడే బస చేస్తారు కూడా.. అదే సందర్భంలో చంద్రబాబు కూడా సంక్రాంతిని సొంతూళ్లోనే జరుపుకుంటారు కాబాట్టి, ఆయన కూడా అక్కడే ఉంటారు...

nara 11012018 3

అయితే మొన్న జగన్ పుట్టిన రోజు నాడు, చంద్రబాబు విష్ చేసినట్టు... పెద్ద పండుగ రోజున జగన్ దగ్గరలోనే ఉంటారు కాబట్టి, సంక్రాంతి పండుగ సందర్భంగా జ‌గ‌న్ ను విందుకు చంద్ర‌బాబు ఆహ్వానిస్తారా ? లేక జగన్ స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి పండుగ శుభాకాంక్షలు చెప్తారా ? ఇలాంటి సంఘటన కనుక జరిగితే, ఇక చెప్పేది ఏమి ఉంటుంది ? ఇద్దరు నేతలు ఒకే చోట, దాదాపు రెండు రోజులు ఉండనున్నారు... ఈ అరుదైన ఘ‌ట‌న నేప‌థ్యంలో రెండు పార్టీల శ్రేణుల‌ల్లోనే కాక, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఆస‌క్తి నెల‌కొంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read