పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధికి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేస్తున్న కృషి అభినందనీయమని ప్రముఖ సినీనటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. శనివారం సామర్లకోట రైల్వేస్టేషన్లో హోంమంత్రి రాజప్ప యశ్వంత్‌పూర్ రైలు దిగగా అదే రైలులో ప్రయాణించి సామర్లకోట చేరుకొన్న దర్శకులు నారాయణమూర్తి హోంమంత్రిని కలసి అభినందించారు. ఈ సందర్భంగా తాను చదువుకొన్న పెద్దాపురం మహారాణి కళాశాల అభివృద్ధితోపాటు తాను సొంత నిధులతో నిర్మించిన రౌతులపూడి ఆసుపత్రిని అన్నివిధాలా అభివృద్ధి చేయాలని హోంమంత్రిని దర్శకులు నారాయణమూర్తి కోరారు. అందుకు హోంమంత్రి సానుకూలంగా స్పందించారు. దర్శకులు నారాయణమూర్తి చెప్పిన వాటి పై సమీక్ష చేసి, తగు విధంగా ముందుకు వెళ్ళటం జరుగుతుందని అన్నారు.
మరో పక్క, విశాఖలో ఎయిర్ పోర్ట్‌లో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ పై జరిగిన దాడి తరువాత ఏపీ హోంశాఖా మంత్రి చిన రాజప్ప స్పందించిన తీరు పై జగన్ పార్ట్ భగ్గు మంటుంది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఠాణేలంక ప్రాంతానికి చెందిన జనిపెల్ల శ్రీనివాస్ అనే యువకుడు జగన్ పై దాడి చేసారని చినరాజప్ప చెప్పారు. ఎయిర్ పోర్ట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న అతను విశాఖ ఎయిర్ పోర్ట్‌లో జగన్‌ని చూసి సెల్ఫీ తీసుకుంటా అని వెళ్లారని.. అనంతరం కత్తితో దాడి చేశారన్నారు. నీకు 160 సీట్లు వస్తాయా? అంటూ జగన్‌ని కత్తితో పొడిచాడని చెప్పారు. దాడి జరిగిన వెంటనే పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని దాడిని ఖండిస్తున్నా అని అన్నారు.