ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు 337 కోట్లు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం... 2016-2017 సంవత్సరానికి రావాల్సిన బకాయిల్లో కొంత విడుదల అయింది.. ముఖ్యమంత్రి చంద్రబాబు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లోకేష్ నిరంతరం కేంద్రంతో సంప్రదింపులు జరిపి, వారి అనుమానులు నివృత్తి చేసి, కేంద్రం అడిగిన సందేహాలు తీర్చి, కూలి వారికి రావరాల్సిన డబ్బులు సాధించారు...
ఉపాధిహామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయి అని ప్రతిపక్ష పార్టీ ఎంపీలు లేఖలు రాసి పేద ప్రజలకు వేతనాలు రాకుండా అడ్డుకున్నారు. కూలీల నోటికాడ కూడు లాగటానికి ప్రయత్నించారు.
అయితే ఉపాధిహామీ పథకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆడిటింగ్ పద్ధతులు, కేంద్ర ప్రభుత్వం అడిగిన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందించి, పేదలకు రావాల్సిన పెండింగ్ బకాయిలు విడుదల చేపించారు మంత్రి లోకేష్... ఎన్ని అడ్డంకులు సృష్టించినా డబ్బులు విడుదల చేసినందుకు, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి తోమర్ గారికి, ధన్యవాదాలు తెలిపారు మంత్రి నారా లోకేష్...