నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సుధాకర్, కరోనా నియంత్రణకు పాటుపడుతున్న డాక్టర్లకు కనీసం మాస్కులు , పీపీఈ కిట్లు కూడా అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. దీని పై తట్టుకోలేని ప్రభుత్వం సుధాకర్ ను విధులనుంచి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి తీవ్ర మనో వేదనకు గురైన సుధాకర్ శనివారం సాయంత్రం పోర్టు హాస్పటల్ ఎదుట హైవేలో నడి రోడ్డు పై కనిపించారు. ఒంటి మీద షర్టు లేకుండా, రోడ్డుపై పడి ఉన్నాడు. అతని చేతులు వెనక్కు విరిచి తాళ్ళతో కట్టేసి ఉన్నాయి. పోలీసులు అతన్ని ఆటోలో ఎక్కించుకుని నాల్గవ వట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీని పై పోలీసులను ప్రశ్నించగా మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ వచ్చి హడావుడి చేశాడని అందుకే అరెస్ట్ చేసామని చెప్పారు. దీనిపై నగర పోలీసు కమిషనర్ స్పందిస్తూ, డాక్టర్ సుధాకర్ చిత్తుగా తాగి నడి రోడ్డు పై అనుచితంగా ప్రవర్తించినట్టు 100కి ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో విధుల్లో ఉన్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని వైద్య వరీక్షల నిమిత్తం సుధాకర్‌ను కేజీహెకు తరలించామన్నారు.
అయితే ఇదంతా ఇలా ఉండగా, నిన్న తాగి ఉన్నాడని, చెప్పిన ప్రభుత్వం, పోలీసులు, నిన్న రాత్రి, సుధాకర్ కు మెంటల్ కండీషన్ సరిగ్గా లేదని, డాక్టర్లు చెప్పారని, అందుకే, అతన్ని మెంటల్ హాస్పిటల్ లో చేర్పించామని చెప్పారు. అయితే, నిన్న తాగి ఇష్టం వచ్చినట్టు చేసాడు అని చెప్పిన ప్రభుత్వం, ఈ రోజు అతనికి మెంటల్ కండీషన్ సరిగ్గా లేదని, మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేస్తున్నాం అని చెప్పటం పతి, తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.నిన్న ఈ ఘటన చూసిన వెంటనే, ప్రభుత్వం ఇలాంటిది ఏదో చేస్తుంది అని అనుకున్నాం అని, అందరూ అనుకున్నట్టె అదే చేసారని, మాస్కులు అడిగినందుకు సస్పెండ్ చేసారు అనే పేరు రాకుండా, చివరకు అతనికి మెంటల్ అని ముద్ర వేసారని ఆగహ్రం వ్యక్తం చేసింది.
ఇలాంటివి సినిమాల్లో చూస్తాం అని, ఇప్పుడు రియల్ లైఫ్ లో చూస్తున్నాం అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ "అంకితభావంతో కరోనా వంటి విపత్కర పరిస్థితులను అత్యంత సమర్ధవంతంగా ఎదుర్కొంటు యన్ 95 మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ని సస్పెండ్ చేయడం దేనికి సంకేతం? ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గం. తన అవినీతి అక్రమాలు ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం జగన్ క్రూర మనస్తత్వానికి అద్దం పడుతుంది. ఒక దళిత డాక్టర్ ను తాళ్లతో కట్టి, లాఠీలతో కొట్టించడం జగన్ ఉన్మాదానికి పరాకాష్ట. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గపు, కక్ష సాధింపు చర్యలతో దళిత ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న జగన్ ప్రభుత్వం పై ఉద్యోగ సంఘాలు,దళిత సంఘాలు, వ్యతిరేకంగా ఉద్యమించి హక్కులను కాపాడుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడికి, ఆయన ఆరోగ్య స్థితికి జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలి. డాక్టర్ సుధాకర్ పై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం కేసులు పెట్టాలి. డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్ ను వెంటనే రద్దు చేయాలి. డాక్టర్ సుధాకర్ ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం." అని అన్నారు.