కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు, సాయంత్రం, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకులు కలిసారు... ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ లాంటి ఉద్దండులతో చర్చించారు... సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో అమిత్ షా, మాట్లాడుతూ, కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు భయపడాల్సిన పని లేదని అమిత్ షా అన్నారు... అదేమిటీ.. మనం రాష్ట్రానికి అడిగినవన్నీ ఇస్తున్నాము కదా... ఎన్నో చేసాం... ఎన్నో ఇచ్చాం... ఇలాంటి వ్యాఖ్యలకు మీరేమీ భయపడనక్కర్లేదు... బూత్‌స్థాయి నుంచీ పార్టీని బలోపేతం చేయండి. కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు జవాబివ్వండి" అంటూ అమిత్ షా గీతోపదేశం చేసి పంపించారు...
ఇదే సందర్భంలో నిధుల గురించి మాట్లాడుతూ... రైల్వే జోన్ అంశాన్ని సైతం పరిశీలిస్తున్నట్టు చెప్పారు... అమరావతికి సంబంధించిన డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రోగ్రసివ్ రిపోర్ట్)ను ఇప్పటివరకూ ఇవ్వేలేదు అని అందుకే, అమరావతికి నిధులు ఇవ్వటం లేదు అని చెప్పారు... అప్పటి నుంచి, రాష్ట్ర బీజేపీ నేతలు కూడా, అదే పల్లవి అందుకుని, డీపీఆర్ ఇవ్వలేదు అంటూ ఎదురు దాడి మొదలు పెట్టారు... వీరందరి విమర్శల పై, అమరావతి వ్యవహారాలు చూస్తున్న మంత్రి నారాయణ స్పందించారు...
కేంద్రానికి డీపీఆర్ పంపలేదనడం అవాస్తవమని మంత్రి నారాయణ తేల్చిచెప్పారు. డీపీఆర్ పంపలేదు కాబట్టే నిధులు కేటాయించలేదనడం అర్థరహితమన్నారు. సీఆర్డీఏ అభివృద్ధికి రూ. 5 లక్షల కోట్లు అవుతుందని చలా రోజుల క్రితమే డీపీఆర్ ఇచ్చామన్నారు. రాజధానిలో పరిపాలన భవన నిర్మాణాలకూ డీపీఆర్ పంపామన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పరిపాలన భవన నిర్మాణాలకు 5 వేల కోట్ల అంచనాలతో, డీపీఆర్ ఇచ్చామన్నారు... మరి, మంత్రి హోదాలో ఆన్ రికార్డు చెప్పిన వ్యాఖ్యలకు, అమిత్ షా ఏమి సమాధానం చెప్తారో చూద్దాం...